Balayya : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ లేనట్టేనా..?
- May 25, 2026 / 12:46 PM ISTByFilmy Focus Desk
టాలీవుడ్‌లో కొత్త కాంబినేషన్లపై ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అలాంటి ఆసక్తిని రేకెత్తించిన కాంబోల్లో ఒకటి దర్శకుడు వివేక్ ఆత్రేయ – నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్. గత కొంతకాలంగా ఈ ఇద్దరి కలయికలో ఓ భారీ సినిమా రాబోతుందనే ప్రచారం ఇండస్ట్రీలో బలంగా వినిపించింది. అయితే తాజా టాక్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ముందుకు సాగడం లేదనే వార్త సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
Balayya
‘సరిపోదా శనివారం’ తర్వాత వివేక్ ఆత్రేయ తన తదుపరి సినిమాను బాలకృష్ణతో ప్లాన్ చేశారనే వార్తలు వచ్చాయి. బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా మాస్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన కథ సిద్ధమైందని, ఇందులో ఆయనను రెండు పాత్రలలో చూపించే ఆలోచన ఉందని అప్పట్లో టాక్ నడిచింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపినట్లు ప్రచారం జరిగింది.

అయితే ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉండటం, డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టంగా మారడం, అలాగే కథా చర్చల్లో కొన్ని మార్పులు అవసరమయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సినిమా తాత్కాలికంగా హోల్డ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. ఇక బాలయ్య ప్రాజెక్ట్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వివేక్ ఆత్రేయ మరో హీరో వైపు దృష్టి మళ్లించినట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజతో ఆయన ఓ డిఫరెంట్ ప్రాజెక్ట్‌పై చర్చలు జరుపుతున్నారనే వార్తలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి.
కాగా ఈ చిత్రం పూర్తి స్థాయి హారర్ థ్రిల్లర్ జానర్‌లో ఉండబోతుందట. ఇప్పటివరకు ఎనర్జిటిక్ మాస్ పాత్రలతో మెప్పించిన రవితేజను, వివేక్ ఆత్రేయ కొత్త కోణంలో చూపించబోతున్నారనే అంచనాలు పెరుగుతున్నాయి. ఇందులో కీలక పాత్ర కోసం ఎస్ జె సూర్య పేరు వినిపిస్తోంది. మొత్తానికి, బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోపై క్లారిటీ రావాల్సి ఉన్నా, దర్శకుడి తదుపరి అడుగు ఏంటన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.












