జాన్వీ కపూర్ ప్లేస్ లో మసుదా బ్యూటీ…..నిజమెంత…..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా , జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్నవిలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ చిత్రం పై ప్రేక్షకుల్లో ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మద్యే రిలీజ్ అయిన చికిరి చికిరి సాంగ్ అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 27, 2026న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఏఆర్ రెహమాన్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ, శివరాజ్‌కుమార్, జగపతి బాబు వంటి సీనియర్ నటులు ప్రధాన పాత్రలలో నటిస్తూ ఈ సినిమా పాన్-ఇండియా స్కేల్‌లో మేకింగ్ జరుపుకుంటుంది.

Bandhavi Sridhar

ఇక తాజాగా బయటకు వచ్చిన ఓ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జాన్వీ కపూర్ పోషిస్తున్న ‘అచ్చియమ్మ’ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్లో ఆమె బాడీ డబుల్‌గా ‘మసూద’ ఫేమ్ బంధవి శ్రీధర్ పనిచేస్తున్నట్లు సమాచారం. ఇద్దరి హైట్, బాడీ లాంగ్వేజ్ దగ్గరగా ఉండటంతో చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ముఖ్యంగా రిస్కీ షాట్స్, బ్యాక్ మరియు వైడ్ యాంగిల్స్‌లో బంధవి కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

శ్రీలంక, పూణే, హైదరాబాద్‌ల్లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేసిన ‘పెద్ది’ టీమ్ ప్రస్తుతం భారీ యాక్షన్ బ్లాక్స్‌ను షూట్ చేస్తోంది. ఈ డూప్ వార్త బయటకు రావడంతో అభిమానులు అధికారిక స్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గంటకు ఎంత అని అడుగుతున్నారు.. వైరల్‌ స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus