Bandla Ganesh: యాక్సిడెంట్ అయిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకున్న బండ్ల గణేష్..!

బండ్ల గణేష్.. కమెడియన్ గా, నిర్మాతగా.. అందరికీ సుపరిచితమే.మంచి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఇతను మాట్లాడే మాటలు సెన్సేషన్ అవుతుంటాయి. అయితే పవన్ కళ్యాణ్ అభిమానుల సపోర్ట్ ఇతనికి ఫుల్ గా ఉంది. అందుకే ఇతను ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా మరోసారి ఇతను వార్తల్లో నిలిచాడు. అయితే వివాదాలతో కాదు ఓ గొప్ప పని చేసి వార్తల్లో నిలిచాడు. వివరాల్లోకి వెళితే.. బండ్ల లింగయ్య అనే వ్యక్తి యాక్సిడెంట్ కు గురయ్యాడు.

చాలా పెద్ద పెద్ద గాయలు అయ్యాయి.దీంతో లింగయ్య సోదరుడు.. బండ్ల గణేశ్‌ ను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ ద్వారా అతను మాట్లాడుతూ… “నమస్కారం అన్న.. ఇతను మా అన్నయ్య బండ్ల లింగయ్య.. ఆటో ప్రమాదం జరిగింది.. ఆపరేషన్ చేశారు 48 కుట్లు వేశారు డాక్టర్స్. 6month ఇంట్లో ఉండమన్నారు. ఆర్ధికంగా చాలా ఇబ్బందిగా ఉంది ఎవ్వరు కూడా స్పందించట్లేదు. మీరైన కొంచెం ఆదుకోండి గణేష్ అన్న🙏 ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.”అంటూ పేర్కొన్నాడు.

ఈ ట్వీట్‌ కు బండ్ల గణేశ్‌ స్పందిస్తూ.. ‘బండ్ల లింగయ్య… గూగుల్ పే నెంబర్‌ పంపు’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇలా అడిగిన వెంటనే.. స్పందించి సాయం చేయడానికి ముందుకొచ్చిన బండ్ల గణేష్ మనస్తత్వానికి నెటిజన్లు…‘నువ్వు సూపర్‌ అన్న’, ‘దేవుడు మీరు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే చేసిన మంచిలో కూడా చెడుని వెతికే మరికొంత మంది మాత్రం.. ‘ఒకే ఇంటిపేరు ఉన్న వ్యక్తికి సాయం చేసాడు.బహుశా అతను దగ్గర బంధువు అయ్యి ఉంటాడు.. లేకపోతే ఎవరో తెలీకుండా గూగుల్ పే నెంబర్ పంపి డబ్బులు వేసేస్తాడా ఏంటి?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus