Bandla Ganesh: హాస్పిటల్ బెడ్ పై బండ్ల గణేష్.. వీడియో వైరల్!

టాలీవుడ్ సీనియర్ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, నిర్మాత అయినటువంటి బండ్ల గణేష్.. గురించి తెలియని వారంటూ ఉండరు. ఒకప్పుడు పలు సినిమాల్లో రెండు, మూడు నిమిషాల పాత్రల్లో కనిపిస్తూ వచ్చిన ఇతను.. సడన్ గా నిర్మాతగా మారి రవితేజతో ‘ఆంజనేయులు’ అనే సినిమా చేశాడు. అది పెద్దగా వర్కౌట్ కాకపోయినా.. కమర్షియల్ గా గణేష్ సేఫ్ అయ్యాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో ‘తీన్ మార్’, ‘గబ్బర్ సింగ్’.. ఎన్టీఆర్ తో ‘బాద్ షా’ ‘టెంపర్’… రాంచరణ్ తో ‘గోవిందుడు అందరివాడేలే’ వంటి పెద్ద సినిమాలు చేశాడు.

ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇద్దామని ట్రై చేసినా ఆ ప్రయత్నం ఫలించలేదు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా అతనికి కలిసి రాలేదు. ఇదిలా ఉంటే.. సడన్ గా ఇతను హాస్పిటల్ పాలవ్వడం ఇండస్ట్రీ వర్గాలను టెన్షన్ కు గురిచేస్తుంది. ‘అతనికి ఏమైంది’ అంటూ ఇండస్ట్రీలోని ప్రముఖులతో పాటు.. అతని సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా ఆందోళనకు గురవుతున్నారు. విషయం ఏంటి అన్నది.. స్పష్టంగా తెలియదు.

కానీ అతను హాస్పిటల్ బెడ్ పై ఉండి ఛాతిపై చేయి వేసుకుని ఇబ్బంది పడుతున్నట్లు, మరోపక్క నర్స్ అతని కుడి చెయ్యికి ఇంజెక్షన్ ఇస్తున్నట్టు ఓ వీడియో వైరల్ అవుతుంది. ‘బండ్ల గణేష్‌కు స్వల్ప అస్వస్థతకి గురైనట్లు.. ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నట్లు’ అందులో ఉంది. కొద్దిసేపటికే ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ప్రస్తుతం బండ్ల గణేష్ ఆరోగ్యం బాగానే ఉన్నట్టు అతని సన్నిహితులు చెబుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus