Bandla Ganesh: రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్.. ట్వీట్ వైరల్

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా కమెడియన్ గుర్తింపు పొందిన బండ్ల గణేష్ గురించి పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాలలో కమెడియన్ పాత్రలలో నటించి అనంతరం నిర్మాతగా బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో బండ్ల గణేష్ ఎలాంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించలేదు. ఇలా సినిమాలు చేయకపోయినప్పటికీ ఈయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాలలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ ఇండస్ట్రీకి సంబంధించిన పలు ఈవెంట్లలో హాజరవుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు.

ఇలా కొన్నిసార్లు బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతూ ఉంటాయి.సోషల్ మీడియా వేదికగా ఈయన ఏ చిన్న పోస్ట్ చేసిన క్షణాల్లో ఆ పోస్టు వైరల్ అవుతూ సంచలనాలను సృష్టిస్తుంది. తాజాగా బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే ఈయన రాజకీయాల గురించి ట్వీట్ చేయడంతో ఈ విషయం పలు చర్చలకు దారితీస్తోంది. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ ట్వీట్ చేస్తూ…

రాజకీయాల వలన జీవితంలో చాలా నష్టపోయాను. నాకు ఏ రాజకీయాలతో, రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. అందరూ ఆత్మీయులే అంటూ ఈ సందర్భంగా బండ్ల గణేష్ రాజకీయాల గురించి చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.అయితే ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే అయితే తాజాగా రాజకీయాల వల్ల చాలా నష్టపోయానంటూ చేసినటువంటి ఈ ట్వీట్ పలు చర్చలకు దారి తీసింది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus