కన్నడ పవర్ స్టార్ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కి అరుదైన గౌరవం లభించింది. పునీత్ రాజ్ కుమార్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ఒక మానవత వాదిగా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలను చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇలా కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబర్ నెలలో ఆకస్మిక మరణం పొందిన సంగతి తెలిసిందే.
తీవ్రమైన గుండెపోటుకు గురైనటువంటి పునీత్ అర్ధాంతరంగా చనిపోవటాన్ని ఇప్పటికీ ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈయన మరణాంతరం పునీత్ రాజ్ కుమార్ కు ఎన్నో గౌరవాలు లభించాయి. గత కొద్ది రోజుల క్రితం పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డుతో కర్ణాటక ప్రభుత్వం సత్కరించింది. ఇకపోతే తాజాగా పునీత్ రాజ్ కుమార్ కు మరొక అరుదైన గౌరవం లభించింది. పునీత్ రాజ్ కుమార్ మరణించిన తర్వాత ఆయన జీవిత చరిత్రను ఒక పాఠ్యాంశంగా చేర్చాలని పలువురు డిమాండ్ చేశారు.
ఈయన నటుడిగా మాత్రమే కాకుండా ఎంతో మందికి సహాయ సహకారాలు చేసినటువంటి ఓ గొప్ప మానవతావాది.ఇలాంటి ఓ గొప్ప వ్యక్తి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఈయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని పలువురు కోరారు. ఈ క్రమంలోనే బెంగళూరు యూనివర్సిటీ బీకాం సిలబస్ లోని వాణిజ్య కన్నడ 3 అనే పాఠ్యపుస్తకంలో ఆయన జీవిత చరిత్రను ఒక పాఠ్యాంశంగా చేర్చారు.
ఇలా డిగ్రీ చదివే మూడో సెమిస్టర్ విద్యార్థులు పునీత్ రాజ్ కుమార్ కు సంబంధించిన మరికొన్ని విషయాలను పాఠ్యాంశంగా చదువుకోవడంతో ఆయన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజంగానే పునీత్ కు దక్కిన అరుదైన గౌరవం అంటూ అభిమానులు సంబరపడుతున్నారు.
18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!
ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?