‘కింగ్’ నాగార్జున,యువసామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా రమ్య కృష్ణ, కృతి శెట్టి.. హీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. ‘జీ స్టూడియోస్’ ‘అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్లు కలిసి నిర్మించిన ఈ చిత్రం 2016లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా తెరకెక్కింది.జనవరి 14న సంక్రాంతి కానుకగా ‘బంగార్రాజు’ విడుదలయ్యింది.సినిమాకి కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే నమోదయ్యాయి.
కానీ ఆ తర్వాత మాత్రం జోరు చూపించలేకపోతుంది.ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించడానికి కిందా మీదా పడుతుంది.ఏపిలో పలు చోట్ల బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ నైజాం, ఓవర్సీస్ విషయంలో చేతులెత్తేసింది. ‘బంగార్రాజు’ 18 డేస్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 8.36 cr |
సీడెడ్ | 7.52 cr |
ఉత్తరాంధ్ర | 5.05 cr |
ఈస్ట్ | 4.07 cr |
వెస్ట్ | 2.90 cr |
గుంటూరు | 3.54 cr |
కృష్ణా | 2.24 cr |
నెల్లూరు | 1.89 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 35.57 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 3.25 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 38.82 cr |
‘బంగార్రాజు’ చిత్రానికి రూ.38.31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.39 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 18 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.38.82 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.0.18 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.అయితే ఒక్క ఆంధ్రాలో తప్ప నైజాం, ఓవర్సీస్ వంటి ఏరియాల్లో ఈ మూవీ నష్టాలను మిగల్చడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే 2022 కి మొదటి క్లీన్ హిట్ ‘బంగార్రాజు’ ఖాతాలో పడే అవకాశం ఉంది.
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!