Barrelakka Shirisha: స్వతంత్ర అభ్యర్థి శిరీష గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన తండ్రి!

  • November 27, 2023 / 08:01 PM IST

తెలంగాణ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి శిరీష(బర్రెలక్క) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు బర్రెల కాస్తున్న ఫ్రెండ్స్ అంటూ ఒక వీడియో షేర్ చేయడంతో ఈమె ఒక్కసారిగా ఎంతో పాపులర్ అయ్యారు. అప్పటినుంచి ఈమె ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఎన్నికలలో ఈమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇలా స్వతంత్ర అభ్యర్థిగా శిరీష పోటీ చేయడంతో కొంతమంది

ఇతర పార్టీ నాయకులు ఈమెను భయపెట్టే ప్రయత్నాలు చేయడమే కాకుండా దాడులకు కూడా దిగారు. అయితే ఈ ప్రచారాలలో భాగంగా ఈమె తన తండ్రి గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. తన తండ్రి తాగుడుకు బానిసగా మారి మమ్మల్ని వదిలేశారని తన తల్లి ఎంతో కష్టపడి తనను చదివించింది అంటూ చెప్పుకోవచ్చారు అయితే తాజాగా ఈమె తండ్రి తన గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా శిరీష తండ్రి మాట్లాడుతూ తను నా గురించి చెప్పినవన్నీ కూడా పచ్చి అబద్దాలేనని తెలిపారు. తనని కష్టపడి చదివించింది నేను వాళ్లే నన్ను బయటకు పంపించారని ఇప్పుడు ఆమె కాస్తున్న బర్రెలు కూడా నేనే కొనిపెట్టాను అంటూ ఈయన తెలియజేశారు. అంతేకాకుండా శిరీషకు ఎంతో ఘనంగా పెళ్లి కూడా చేశాను అంటూ శిరీష పెళ్లికి సంబంధించిన పెళ్లి పత్రికను కూడా చూపించారు.

అందరిలా కాకుండా తన బిడ్డ పెళ్లి ఎంతో ఘనంగా చేశానని అయితే పెళ్లి చేసిన తరువాత కొద్ది రోజులకే తన భర్తను వదిలేసి తిరిగి పుట్టింటికి వచ్చిందని ఈయన తెలిపారు. ఇలా కన్న తండ్రి గురించి ఆమె మాట్లాడిన మాటలు అన్నీ కూడా అబద్ధమని శిరీష (Shirisha) గురించి తన తండ్రి మాట్లాడుతూ ఈ సందర్భంగా చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus