‘రాధేశ్యామ్’ టీజర్.. ప్రభాస్, పూజాల జంట అదుర్స్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ‘రాధేశ్యామ్’ సినిమా నుండి మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేస్తామని చిత్రబృందం అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగా ఈరోజు చిన్నపాటి టీజర్ లాంటి మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. సాధారణంగా మోషన్ పోస్టర్ అంటే ఒక పోస్టర్ ని బిట్ బిట్ లుగా రివీల్ చేసి.. ఫైనల్ గా పోస్టర్ చూపిస్తారు. కానీ ‘రాధేశ్యామ్’ మోషన్ పోస్టర్ ని కాస్త లెంగ్తీగా టీజర్ చూపించిన ఫీలింగ్ ని క్రియేట్ చేశారు.

ఈ టీజర్ ఆరంభంలో సినిమాకు కీలకమైన హస్త సాముద్రికం చూపించారు. ఆ చేయి మీదుగా కొండలు, ఆపై ఓ రైలు, ఆ రైలులో ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికులను పరిచయం చేస్తూ.. ఆ తరువాత రైలులో నుండి బయటకు ఎగురుతున్న ఒక సున్నీ.. ఆ చున్నీని ఓ చేయి పట్టుకోవడం.. ఆ ట్రైన్ డోర్ దగ్గర హీరోయిన్ కనిపించడం.. ఆ వెంటనే హీరో తన భారీ పర్సనాలిటీతో ఒక కాలు ట్రైన్ మీద.. మరో కాలు గాలిగా వేసి కనిపించడంతో పోస్టర్ పూర్తవుతుంది.

దీనికి జస్టిన్ ప్రభాకరన్ అందించిన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ అయింది. ఈ టీజర్ లో ప్రభాస్, పూజాహెగ్డే ల జంటగా అదుర్స్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌ బ్యానర్స్‌పై సినిమా నిర్మితమవుతోంది. కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా షూటింగ్ నిలిపివేసిన యూనిట్.. ప్రస్తుతం‌ ఇటలీలో మిగిలిన భాగం షూటింగ్ చేస్తోంది. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus