వాళ్ళిద్దరినీ కూడా పెళ్లి చేసుకోబోతోంది అంటూ కథనాలు..!

టాలీవుడ్లో ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది అనుష్క. పెద్ద హీరోల సినిమాల్లో నటించకపోవచ్చు.. కానీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనే రూ.30కోట్లకు పైగా వసూళ్ళను రాబట్టిన ఘనత అనుష్కకే దక్కింది. అలా అని ఈమె తన క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎంత చిన్న డైరెక్టర్ కు అయినా లేదా ప్లాప్ డైరెక్టర్ కు అయినా.. ఈమె సినిమా చేస్తాను అని మాట ఇస్తే.. ఆ మాట తప్పదు. కచ్చితంగా సినిమా చేస్తుంది.

సినిమా ప్లాప్ అయితే తన క్రేజ్ దెబ్బతింటుంది అని కూడా ఆలోచించదు. ఒకవేళ అందులో తన పాత్రకు తగినట్టుగా మేకోవర్ మార్చుకోవాల్సి వస్తే కచ్చితంగా మార్చుకుని తీరుతుంది. ‘పంచాక్షరి’ ‘సైజ్ జీరో’ ‘నిశ్శబ్దం’ చిత్రాలే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవాలి. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. అనుష్క పై రూమర్స్ కూడా ఎక్కువగానే వస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తో ఈమె ప్రేమలో ఉందని.. త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోబోతుందని’ గత కొంత కాలంగా రూమర్లు వస్తూనే ఉన్నాయి.

అయితే ప్రభాస్ కంటే ముందే ఓ హీరో మరో టెక్నిషియన్ ను అనుష్క పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. కొంచెం డీప్ గా వెళ్తే గతంలో గోపీచంద్ తో అనుష్క ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. వీళ్ళిద్దరూ ‘లక్ష్యం’ ‘శౌర్యం’ వంటి సినిమాల్లో నటించారు. అవి రెండూ కూడా సూపర్ హిట్లు అయ్యాయి. అయితే 2013లో హీరో శ్రీకాంత్ మేనకోడల్ని వివాహం చేసుకున్నాడు గోపీచంద్. అలాగే రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ అయిన సెంథిల్ కుమార్ తో కూడా అనుష్క పై పెళ్లి రూమర్లు వచ్చాయి. కానీ 2009లోనే అతను పెళ్లి చేసుకోవడంతో వాటికి ఫుల్ స్టాప్ పడింది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus