2014, 15, 16 నంది అవార్డులు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం!

  • November 14, 2017 / 12:44 PM IST

తెలుగు నటీనటులను ప్రోత్సహించే దిశగా అందించే నంది అవార్డుల జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 2014, 15, 16 లలో ఉత్తమ నటన ప్రదర్శించిన నటీనటులు, టెక్నీషియన్ల పేర్లను వెల్లడించింది. 2014 సంవత్సరానికి ఉత్తమ నటుడిగా బాలకృష్ణ ఎంపికయ్యారు. అలాగే అతను నటించిన లెజెండ్ మూవీ ఉత్తమ చిత్రంగా నిలిచింది. దీంతో కళ్యాణ్ రామ్ బాబాయ్ బాలయ్యకి, తమ్ముడు తారక్ కి సోషల్ మీడియా వేదికపై శుభాకాంక్షలు చెప్పారు…

ఇక 2015 లో ఉత్తమ చిత్రంగా బాహుబలి నిలిచింది. ఉత్తమ నటుడిగా శ్రీమంతుడు చిత్రానికి గానే మహేష్ బాబు ఎంపికయ్యారు. 2016 లో ఉత్తమ చిత్రంగా పెళ్లి చూపులు.. ఉత్తమ నటుడు గా ఎన్టీఆర్ నంది అవార్డు వరించింది…

అవార్డు గ్రహీతలు
2014 ఉత్తమ చిత్రం లెజెండ్‌
2014 ఉత్తమ నటుడు (బాలకృష్ణ(లెజెండ్‌)
2014 ఉత్తమ ప్రజాదరణ చిత్రం లౌక్యం
2014 ఉత్తమ ప్రతినాయకుడు జగపతిబాబు (లెజెండ్‌)
2014 ఉత్తమ సహాయ నటుడు నాగచైతన్య (మనం)
2014 ద్వితీయ ఉత్తమ చిత్రం (మనం)
2015 ఉత్తమ చిత్రం బాహుబలి (బిగినింగ్‌)
2015 ఉత్తమ నటుడు మహేష్‌బాబు (శ్రీమంతుడు)
2016 ఉత్తమ చిత్రం పెళ్లిచూపులు
2016 ఉత్తమ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌
2015 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు : కె.రాఘవేంద్రరావు
2016 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు : రజనీకాంత్‌
2015 బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డు : త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌
2016 బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డు : బోయపాటి శ్రీనివాస్‌

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus