Acharya Teaser: ఫ్యాన్స్‌కి భలే స్టఫ్ ఇచ్చిన కొరటాల శివ!

  • November 29, 2021 / 11:32 AM IST

కమర్షియల్‌ సినిమాలకు సందేశం హంగులు జోడించి సినిమాలు తీయడంలో దిట్ట కొరటాల శివ. ఆయన నుండి ఇప్పటివరకు వచ్చిన సినిమాలు అన్నింటిలోనూ ఇలాగే మాస్‌ + మేటర్‌ ఉంటుంది. దీంతోపాటు ఆయన సినిమాల్లో మరో విషయాన్ని కూడా గమనించొచ్చు. అదే హీరోయిజం ఎలివేషన్లు. హీరోను ఎలా చూపిస్తే అభిమానులు ఉర్రూతలూగుతారో కొరటాలకు బాగా తెలుసు. అందుకే హీరో ఎవరైనా… తన కథలో పడితే అదరగొట్టేస్తుంటాడు. తాజాగా ‘ఆచార్య’లో అదే జరిగిందంటున్నారు.

‘ఆచార్య’లో రామ్‌చరణ్‌ సిద్ధ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. దీనికి సంబంధించి చిత్రబృందం ఇటీవల ఓ టీజర్‌ను విడుదల చేసింది. సుమారు 72 సెకన్లు ఉన్న ఈ టీజర్లో రామ్‌చరణ్‌ ఓ డైలాగ్‌ చెప్పాడు, ఫైట్‌ చేశాడు, చిన్నపాటి రొమాన్స్‌ చేశాడు. ఇవన్నీ అదిరిపోయాయి. దీంతోపాటు మరో రెండు షాట్లు ఉన్నాయి. వాటిని చూసి అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు అంటే అతిశయోక్తి కాదేమో. సోషల్‌ మీడియాలో ఇప్పుడు ఆ రెండు షాట్ల గురించే చర్చ అంతా.

టీజర్‌ ఎండింగ్‌లో అడవిలోని ఏరులో పులి, పులి పిల్ల నీళ్లు తాగుతుంటాయి. పులి పిల్ల జాగ్రత్తగా నీళ్లు తాగుతుంటే… వెనుక తల్లి పులి చుట్టూ తీక్షణంగా చూస్తూ ఉంటుంది. తన బిడ్డ జోలికి వస్తే వదిలేది లేదు అని చెప్పేలా. ఆ షాటను అలా రైట్‌ సైడ్‌కు పాన్‌ చేస్తారు వీడియోలో. అప్పుడు సిద్ధ అలియాస్‌ రామ్‌చరణ్‌ అలానే ఏరులో నీళ్లు తాగుతుంటాడు. ఆ వెనుక పెద్ద పులి మాదిరి చిరంజీవి తీక్షణంగా చూస్తుంటాడు. ఈ రెండింటినీ కలపాలనే ఆలోచన వచ్చిన కొరటాల ప్రతిభ గురించి ఎంత పొగిడినా తక్కువే అంటున్నారు నెటిజన్లు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus