శివశంకర్ మాస్టర్ 15 వేలకు పైగా పాటలకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు. అయితే అందులో మీకు నచ్చినవి ఏవీ అంటే… చాలానే పేర్లు వినిపిస్తున్నాయి. ఆయనకు కూడా చాలా పాటలే నచ్చి ఉంటాయి. కానీ వాటిలో బెస్ట్ చెప్పమంటే… ఆయన రెండు సినిమాల గురించి, అందులోని పాటల గురించి చెప్పారు. ఆ పాటల కోసం ఆయన పడ్డ కష్టం గురించి కూడా ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ సినిమాలేంటో తెలుసా? ఒకటి ‘అరుంధతి’, రెండోది ‘మగధీర’. ఆ పాట గురించి ఆయనేం చెప్పారంటే…
‘అరుంధతి’లో జేజేమ్మగా అనుష్క నటనకు ప్రేక్షకులు మైమరచిపోయారు. ఆమెను అలా చూస్తూ ఉంటే చాలు అనేంతగా ఆమె పాత్ర రూపొందించారు. ఇక పశుపతిగా సోనూసూద్ నటన చూసి అయితే భయపడిపోయారు. పశుపతిని అంతం చేయడానికి జేజేమ్మగా అనుష్క చేసిన డ్యాన్స్ సీక్వెన్స్ గుర్తుందా. ‘భు భు భుజంగం.. ది ది తరంగం…’ అంటూ సాగే ఆ పాటను శివశంకర్ మాస్టరే కొరియోగ్రఫీ చేశారు. దాదాపు 32రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించారట.
శివ శంకర్ మాస్టర్ ఒక పాటను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేసేస్తుంటారట. బాగా కాంప్లికేటడ్ సాంగ్ అయితే మరో రోజు అనుకోండి. అయితే ‘మగధీర’లోని ‘ధీర ధీర…’ పాటను పూర్తి చేయడానికి సుమారు 22 రోజులు పట్టిందట. ఆ పాటను కొంత భాగం రాజస్థాన్‌లో తెరకెక్కించారు. ఆ పాట చూస్తే… చుట్టూ ఉప్పు మాత్రమే ఉంటుంది. ఆ ప్రాంతంలో సుమారు వారం షూట్ చేశారట. ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేసి 15 రోజులు షూటింగ్ చేశారట. అన్నట్టు ఈ పాటకు ఆయనకు జాతీయ పురస్కారం కూడా వచ్చింది.
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?