ఈ 10 సినిమాల్లోనూ హీరో కంటే విలన్లే హైలెట్..!

  • February 24, 2021 / 11:12 AM IST

హీరోయిజం బాగా పండాలి అంటే.. అటు వైపు విలన్ ను గట్టోడిని పెట్టేసి.. వాడిని హీరో ఎగరేసి ఎగరేసి కొడితే సరిపోతుంది అని అనుకునేవాళ్లు అప్పట్లో..! అలాగే ఇప్పుడు కూడా తీస్తే.. ప్రేక్షకులు ఆ సినిమాని పక్కన పెట్టెయ్యడం ఖాయం. అలా అని విలన్ ని ఎక్కువ హైలెట్ చేసినా సినిమా తేడా కొట్టేస్తుంది. హీరోతో సమానంగా విలన్ క్యారెక్టర్ ఉండేలా ప్రెజెంట్ చెయ్యాలి. ఆ తరువాత హీరో విలన్ ని కండలతో కాదు మైండ్ గేమ్స్ తో పతనం చెయ్యాలి. ఇప్పటి ఆడియెన్స్ కు అదే కావాలి. ఇదొక పార్ట్ అనుకుంటే మరొకటి ఉంది.. ఇప్పటి దర్శకనిర్మాతలకు హీరో, హీరోయిన్స్ ను సెట్ చెయ్యడమే ఓ పెద్ద టాస్క్ అనుకుంటే.. ఇప్పుడు విలన్ ను సెట్ చెయ్యడం కూడా పెద్ద టాస్క్ అయిపోతుంది.

అందుకే ఈ మధ్య కొన్ని సినిమాల్లో.. ఇప్పుడిప్పుడే హీరోలుగా ఎదుగుతున్న వారిని విలన్లుగా పెట్టేస్తున్నారు.తద్వారా సినిమా పై క్రేజ్ ఏర్పడుతుంది అనేది దర్శకనిర్మాతల ప్లాన్.ఇక వారి పాత్రలకు కూడా వెయిట్ ఉండాలి కదా.. అందుకే హీరోలను ముప్పుతిప్పలు పెట్టేస్తున్నట్టు సినిమాలో చూపిస్తున్నారు.సరే ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే.. విలన్ డామినేషన్ ఎక్కువైన కొన్ని సినిమా లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

1) మాస్టర్ :

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రంలో స్టార్ హీరో విజయ్ కు ధీటుగా ఉంటుంది విలన్ విజయ్ సేతుపతి పాత్ర. నిజానికి హీరో పాత్ర కంటే విలన్ పాత్రనే ఈ సినిమాలో ఎక్కవగా ఎంజాయ్ చేశారు అనడంలో అతిశయోక్తి లేదు.

2) ధృవ :

ఈ చిత్రంలో హీరో చరణ్ ను తన మైండ్ గేమ్స్ తో ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటాడు విలన్ అరవింద్ స్వామి.

3) స్పైడర్ :

మహేష్ బాబు వంటి స్టార్ హీరోని విలన్ ఎస్.జె.సూర్య పరుగులు పెట్టించేస్తుంటాడు ఈ సినిమాలో..! హీరో అండ్ విలన్ ఎదురుగా ఉంటే.. విలనే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు.

4) అభిమన్యుడు :

విశాల్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కూడా విలన్ అర్జున్ పాత్రే ఎక్కువ హైలెట్ గా నిలుస్తుంటుంది.

5) నానీస్ గ్యాంగ్ లీడర్ :

ఈ చిత్రంలో కూడా అంతే.. విలన్ పాత్రే హైలెట్. హీరోకి చమటలు పట్టిస్తుంటాడు.

6) నిజం :

మహేష్ బాబు వంటి స్టార్ హీరోని విలన్ గోపిచంద్ ఏడిపిస్తూ ఉంటాడు ఈ సినిమాలో..!

7) బాహుబలి 1:

రాజమౌళి తెరకెక్కించిన ఈ మొదటి పార్ట్ లో విలన్ గా రానా నే హైలెట్ గా నిలిచాడు. ప్రభాస్ కంటే ఎక్కువగా అతని ఎలివేషన్స్ ఉంటాయి.

8) సెవెంత్ సెన్స్ :

ఈ చిత్రంలో కూడా హీరో సూర్య పాత్రని విలన్ జానీ పాత్ర డామినేట్ చేస్తుంటుంది.

9) యుద్ధం శరణం :

నాగ చైతన్య హీరోగా నటించిన ఈ చిత్రంలో కూడా విలన్ శ్రీకాంత్ పాత్ర డామినేట్ చేస్తుంటుంది.

10) అతిథి :

మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంలో విలన్ మురళి శర్మ పాత్ర చాలా డామినేషన్.

11) వర్షం :

ఈ సూపర్ హిట్ చిత్రంలో కూడా ప్రభాస్ ను.. విలన్ గోపీచంద్ పాత్ర డామినేట్ చేస్తుంటుంది.

12) జులాయి :

హీరో విలన్ ఒకేలా ఆలోచిస్తే ఎలా ఉంటుందో .. అలా బన్నీ, సోను సూద్ ల పాత్రలు ఉంటాయి. అందుకే సోనూ సూద్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది.

13) జై చిరంజీవ:

మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోని విలన్ అర్బాజ్ ఖాన్ పాత్ర బాగా డామినేట్ చేస్తుంటుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus