అందువల్లే ఇన్నాళ్లూ దూరంగా ఉండాల్సి వచ్చింది

కథానాయికల కెరీర్ లు ఎక్కువకాలం ఉండవన్న విషయం తెలిసిందే. ఎంత సక్సెస్ ఫుల్ కెరీర్ ను లీడ్ చేసిన హీరోయిన్లైనా.. కెరీర్ స్లో అయినా లేక పెళ్లైనా సినిమాలకు, సినిమా ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. కానీ.. విచిత్రంగా బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో నటించి దాదాపు బాలీవుడ్ లోని అందరు స్టార్ హీరోలతో కలిసి నటించినా కూడా “ప్రేమ పావురాలు” ఫేమ్ భాగ్యశ్రీకి అవకాశాలు పక్కన పెడితే కనీసం పట్టించుకొనేవారు కరువయ్యారు. అందుకు కారణం ఇండస్ట్రీలో ఆమెకు ఎవరితోనూ సత్సంబంధాలు లేకపోవడమే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా మీడియాతో చెప్పుకొచ్చింది.

భాగ్యశ్రీ సినిమాలు వదిలేశాక కొన్నాళ్లు బ్రేక్ తీసుకొని టీవి ఇండస్ట్రీలో బిజీ అవ్వడానికంటే ముందు నుంచీ మళ్ళీ సినిమాల్లోకి రావాలి అనుకుందట. అయితే.. తనకంటూ స్పెషల్ పి.ఆర్ టీం కానీ మేనేజ్ మెంట్ టీం కానీ లేకపోవడంతో ఎవర్ని కాంటాక్ట్ చేయాలో తెలియక ఇన్నాళ్లూ తెలివిజన్ కు పరిమితమైపోయిందట. చాన్నాళ్ల తర్వాత తెలుగులో “2 స్టేట్స్” చిత్రంలో తల్లిగా మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తోంది భాగ్యశ్రీ. ఈ చిత్రంలో పాత్ర అవసరం మేరకు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొందట భాగ్యశ్రీ. మరి ఈ రీఎంట్రీతో భాగ్యశ్రీ మళ్ళీ ఎప్పట్లానే బిజీ అవుతుందో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus