యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) నుండి వస్తున్న లేటెస్ట్ మూవీ ‘భలే ఉన్నాడే’ (Bhale Unnade) . దర్శకుడు మారుతి టీం నుండి వస్తున్న సినిమా కావడంతో దీనిపై కొంతమంది ఆడియన్స్ దృష్టి పడింది. ‘గీతా సుబ్రమణ్యం’, ‘పెళ్లిగోల 2’ వంటి వెబ్ సిరీస్…లు తెరకెక్కించిన శివ సాయి వర్ధన్ (J Sivasai Vardhan) డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్..లో మారుతి (Maruthi Dasari) మార్క్ కనిపించింది. అందుకే రాజ్ తరుణ్ వరుస ప్లాపుల్లో ఉన్నప్పటికీ దీనికి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది.
ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 0.60 cr |
సీడెడ్ | 0.18 cr |
ఉత్తరాంధ్ర | 0.30 cr |
ఈస్ట్+వెస్ట్ | 0.10 cr |
కృష్ణా+గుంటూరు | 0.15 cr |
నెల్లూరు | 0.08 cr |
ఏపి+తెలంగాణ | 1.41 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ | 0.12 cr |
వరల్డ్ వైడ్(టోటల్) | 1.53 cr |
‘భలే ఉన్నాడు’ చిత్రానికి రూ.1.53 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమాకి స్ట్రాంగ్ మౌత్ టాక్ వస్తేనే సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు అంటే కష్టమే..! మరోపక్క ‘దేవర’ (Devara) వంటి పెద్ద సినిమా కోసం వెయిట్ చేస్తున్న ప్రేక్షకులు.. ఇలాంటి చిన్న సినిమాల కోసం థియేటర్లకు వస్తారో లేదో తెలియాల్సి చూడాలి.