భరత్ అను నేను మూవీ థియేట్రికల్ ట్రైలర్ | మహేష్ బాబు, కైరా అద్వాని

మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమాలు తెరకెక్కించి హ్యాట్రిక్ హిట్ అందుకున్న డైరక్టర్ కొరటాల శివ మరో హిట్ కొట్టనున్నారు. మహేష్ బాబుతో భరత్ అను నేను సినిమా చేస్తున్నారు. నిన్నటితో ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. శ్రీమంతుడు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై మొదట నుంచి భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను ఫస్ట్ ఓత్, భరత్ విజన్ లు పెంచాయి. పాటలు మరింత క్రేజ్ తీసుకొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలోను భారీగా రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి ప్రతిపక్షనేతగా తనదైన శైలిలో నవ్వులు పూయించనున్నారు. ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 20 న  ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus