1996 లో రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ‘భారతీయుడు'(ఇండియన్) ని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. ప్రభుత్వ ఆఫీసుల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో.. ఉండే అవినీతిని వేలెత్తి చూపించిన సినిమా ఇది. అలాంటి అవినీతిని అంతం చేసేందుకు సేనాపతి అనే సూపర్ హీరో ఉంటే ఎలా ఉంటుంది అనే సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుని.. విజువల్ వండర్ గా దర్శకుడు శంకర్ (Shankar) ఈ చిత్రాన్ని ఆవిష్కరించాడు. ఆ రోజుల్లోనే అత్యున్నత సాంకేతిక విలువలతో కూడుకున్న సినిమాగా ‘భారతీయుడు’ ఓ ట్రెండ్ సెట్ చేసింది.
ఇక 28 ఏళ్ళ తర్వాత దీనికి సీక్వెల్ గా ‘భారతీయుడు2′(ఇండియన్ 2 (Bharateeyudu 2) రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘లైకా ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూలై 12 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈరోజు ఫస్ట్ సింగిల్ తో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ‘శౌరా..అగణిత సేనా సమాగం..భీరా వేఖడ్గపు ధారా.. రౌరా క్షత గాత్రా భరణుడి.. వౌరా పగతుర సంహారా.. శిరసెత్తే శిఖరం నువ్వే..నిప్పులు గక్కే ఖడ్గం నీదే” అంటూ ఈ పాట సాగింది.
చూస్తుంటే ఇది సేనాపతి ఇంట్రడక్షన్ అనిపిస్తుంది. ఈ పాటని హై స్టాండర్డ్స్ లో శంకర్ చిత్రీకరించి ఉంటారు అనే ఆలోచన వచ్చేలా లిరిక్స్ ఉన్నాయని చెప్పొచ్చు. నేషనల్ అవార్డు విన్నర్ అయినటువంటి సుద్దాల అశోక్ తేజ (Suddala Ashok Teja) ఈ పాటకు లిరిక్స్ అందించగా సంగీత దర్శకుడు అనిరుధ్ (Anirudh Ravichander) .. శృతిక సముద్రలతో కలిసి పాడటం జరిగింది. పాట అయితే బాగానే ఉంది. సినిమా చూస్తున్నప్పుడు ఇంకా ఆకట్టుకుంటుందేమో అనే ఫీలింగ్ ను కలిగిస్తుంది. మీరు కూడా ఒకసారి వినండి :