ఆమె కథానాయికగా హిట్స్ కొట్టినప్పుడు, ఫ్లాప్స్ చవిచూసినప్పుడు ఎంతమంది ఆమెను పట్టించుకొన్నారో తెలియదు కానీ.. ఆమెపై మలయాళ స్టార్ నటుడైన దిలీప్ జరిపిన అఘాయిత్యానికి మాత్రం దేశ వ్యాప్తంగా మద్దతు లభించింది. ఆమె మరెవరో కాదు తెలుగులో “మహాత్మా, ఒంటరి” చిత్రాల్లో కథానాయికగా నటించి ఆకట్టుకొన్న బబ్లీ బ్యూటీ భావన. ఆమెను కొందరు కిరాయి గూండాలు కిడ్నాప్ చేసి మరీ ఆమెను బలాత్కరించడానికి యత్నించారు. ఆమె వారి నుంచి తప్పించుకోవడం ఆ తర్వాత యావత్ సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఆమెకి అండగా నిలవడంతో దిలీప్ ప్రస్తుతం జైల్లో మగ్గుతున్నాడు.
అయితే.. ఈ రచ్చ జరిగిన మరుసటి నెలలోనే తన స్నేహితుడు నవీన్ తో ఎంగేజ్ మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది భావన. ఆమె నిర్ణయానికి అందరూ హర్షం వ్యక్తం చేశారు. నిజానికి అక్టోబర్ లో వారి పెళ్లి జరగాల్సి ఉండగా.. కారణాంతరాల వల్ల ఆ పెళ్లి పోస్ట్ పోన్ అయ్యింది. దాంతో వారి వివాహం మొత్తానికి ఆగిపోయిందనే కథనాలు వెలువడ్డాయి. అప్పుడు సైలెంట్ గా ఉండిపోయిన భావన నేడు ఘనంగా తన వివాహ వేడుకను థ్రిస్సూర్ లోని జవహర్ లాల్ కన్వెక్షన్ సెంటర్ లో జరుపుకొంది. ఇవాళ సాయంత్రం అదే వెన్యూలో రెసెప్షన్ కూడా ఉంది. సౌత్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు.
మరి పెళ్లి అయిపోయింది కాబట్టి భావన సినిమాలకు స్వస్తి పలుకుతుందా లేక కొత్త జీవితంతోపాటు సరికొత్త కెరీర్ ని కూడా మొదలెడుతుందా అనేది చూడాలి.