పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్లో సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ‘సితార ఎంటెర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించగా…. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి సంభాషణలు,స్క్రీన్ ప్లే ను అందించారు. ఫిబ్రవరి 25న భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ బ్రేక్ ఈవెన్ అవ్వడంతో విఫలమయ్యిందనే చెప్పాలి.
ఆంధ్రలో టికెట్ రేట్ల ఇష్యు నడుస్తున్నప్పటికీ ఈ చిత్రం తొలివారం భారీగా కలెక్ట్ చేసింది.అయితే రెండో వారం చేతులెత్తేసిందనే చెప్పాలి.ఇక 15 రోజున కూడా ఈ చిత్రం మోస్తరుగా కలెక్ట్ చేసింది.
ఒకసారి 15డేస్ కలెక్షన్లు గమనిస్తే :
నైజాం | 31.04 cr |
సీడెడ్ | 10.83 cr |
ఉత్తరాంధ్ర | 7.35 cr |
ఈస్ట్ | 5.43 cr |
వెస్ట్ | 5.03 cr |
గుంటూరు | 5.12 cr |
కృష్ణా | 3.77 cr |
నెల్లూరు | 2.44 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 71.01 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 7.33 cr |
ఓవర్సీస్ | 12.37 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 90.71 cr |
‘భీమ్లా నాయక్’ చిత్రానికి రూ.109.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.110 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.15 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.90.71 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు మరో రూ.19.29 కోట్ల షేర్ ను రాబట్టాలి. 3వ వీకెండ్ కు ‘భీమ్లా’ 250 థియేటర్లు హోల్డ్ చేసింది. ‘రాధే శ్యామ్’ నిన్న రిలీజ్ అయినప్పటికీ ఈ చిత్రానికి రూ.0.12 కోట్లకు షేర్ నమోదైంది.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!