నితిన్, రష్మిక మందన జంటగా నటించిన తాజా చిత్రం ‘భీష్మ’. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని మొదటి వారం పూర్తయ్యేసరికే బ్రేక్ ఈవెన్ సాధించింది. వరుసగా 3 ప్లాప్ లతో సతమతమవుతోన్న నితిన్ ఈ చిత్రంతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. అయితే ఈ చిత్రం ఓపెనింగ్స్ ను చూసి కచ్చితంగా.. నితిన్ కెరీర్ బెస్ట్ అయిన ‘అఆ’ కలెక్షన్లను అధిగమిస్తుంది అని అంతా భావించారు. కానీ డ్రై సీజన్ కావడం అందులోనూ… కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల అంతగా రాణించలేకపోయిందనే చెప్పాలి.
ఇక ఈ చిత్రం 20 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 9.21 cr |
సీడెడ్ | 3.30 cr |
ఉత్తరాంధ్ర | 3.15 cr |
ఈస్ట్ | 1.77 cr |
వెస్ట్ | 1.32 cr |
కృష్ణా | 1.61 cr |
గుంటూరు | 1.88 cr |
నెల్లూరు | 0.82 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.93 cr |
ఓవర్సీస్ | 3.31 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 28.30 cr |
‘భీష్మ’ చిత్రానికి 22.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 20 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 28.30 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. ఇప్పటికే ఈ చిత్రం కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాట పట్టారు. అయితే ఫిబ్రవరి బ్లాక్ బస్టర్ అయిన ‘మిర్చి’ కలెక్షన్లను మాత్రం అధిగమించలేకపోయింది. ఓవర్సీస్ లో ఈపాటికే 1 మిలియన్ దాటుతుంది అనుకుంటే.. అక్కడ కూడా దెబ్బ పడిందనే చెప్పాలి. ఈ వారానికి 1 మిలియన్ సాధించే అవకాశం ఉంది.. మరి ఆ అవకాశాన్ని ఎంత వరకూ ఉపయోగించుకుంటుందో చూడాలి..!
Click Here To Read Bheeshma Movie Review
Most Recommended Video
పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!