సినీ పరిశ్రమలో మరో విషాదం.. సూసైడ్ చేసుకుని కన్నుమూసిన నటి.!

సినీ పరిశ్రమని విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2024 లో ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు వివిధ కారణాల వల్ల మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ లిస్ట్ గురించి చెప్పాలంటే చాలానే ఉంది. తాజాగా మరో నటి కూడా సూసైడ్ చేసుకుని చనిపోయింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ భోజ్‌పురి నటి అమృతా పాండే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. శనివారం నాడు బీహార్‌, భాగల్‌పూర్‌లో ఉన్న అపార్ట్‌మెంట్‌లోని ఆమె ఫ్లాట్ లో శవమై దర్శనమిచ్చింది.

అమృత ఆమె గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నట్టు తెలుస్తుంది. తన భర్తతో కలిసి ముంబైలో నివసించే అమృత ఇలా బలవన్మరణానికి పాల్పడటం అనేది అందరికీ షాకిస్తున్న విషయం. కొద్దిరోజుల క్రితం భాగల్పూర్‌లో ఉన్న ఆమె బంధువుల వివాహానికి కూడా ఈమె వెళ్లి.. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడిపింది. అయినా ఇలా ఎందుకు చేసుకుంది అనేది ఎవరికీ అర్థం కాని విషయం. అయితే ఆమె వాట్సాప్ స్టేటస్ లో తన ఆత్మహత్యకు కారణాలు పెట్టినట్టు టాక్ వినిపిస్తుంది.

పోలీసులు ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈమె మృతి పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈమె కెరీర్ ను పరిశీలిస్తే.. ‘దీవానాపన్’ అనే సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అమృతా పాండే … ఆ తర్వాత అంటే 2022లో ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన చంద్రమణి ఝంగ్డేను వివాహం చేసుకోవడం జరిగింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus