Bhola Shankar: భోళా శంకర్ మూవీతో చిరు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్.. కానీ?

ఆరోజు నీపైచిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన భోళా శంకర్ మూవీ మరో వారం రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా భోళా శంకర్ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోగా సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం గమనార్హం. చిరంజీవి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండనున్నాయని తెలుస్తోంది.

మెగా ఫ్యాన్స్ కోరుకున్న భారీ విజయం ఈ సినిమాతో చిరంజీవికి దక్కుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాకు సెన్సార్ సభ్యుల నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. చిరంజీవి ఫ్యాన్స్ కు విందు భోజనంలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. మెహర్ రమేష్ ఈ సినిమాను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశారని సమాచారం. మెహర్ రమేష్ ఈ సినిమాతో కచ్చితంగా ప్రూవ్ చేసుకుంటారని రీమేక్ సినిమా కావడంతో ఈ సినిమా అంచనాలను అందుకుని మెప్పించడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వాల్తేరు వీరయ్య సినిమాను మించి ఈ సినిమా ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. భోళా శంకర్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని సెన్సార్ రిపోర్ట్ ద్వారా వెల్లడవుతోంది. భోళా శంకర్ మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

భోళా శంకర్ (Bhola Shankar) సినిమాలో తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటించడం గమనార్హం. భోళా శంకర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ కూడా ఫిక్స్ అయింది. ఈ నెల 6వ తేదీన ఈ మూవీ ఈవెంట్ జరగనుంది. ఈ సినిమాతో మెహర్ రమేష్ సక్సెస్ ట్రాక్ లోకి రావడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus