బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో తెలుగు సీజన్7 పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు సైతం తమ పిల్లల గురించి జరుగుతున్న నెగిటివ్ కామెంట్లు, ప్రచారం గురించి స్పందించి క్లారిటీ ఇవ్వడం కేవలం ఈ సీజన్ లోనే జరుగుతోంది. భోలే షావళి తల్లి తాజాగా ఎమోషనల్ అవుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నా కొడుకు మనస్సు ఎంతో మంచిదని పది మందికి అన్నం పెట్టే మంచి మనస్సు ఉందని ఆమె అన్నారు.
అలాంటి వ్యక్తిని హౌస్ లో అలా చేస్తారని అనుకోలేదని భోలే షావలి తల్లి పేర్కొన్నారు. నా కొడుకును ప్రియాంక జైన్ థూ అని అనడానికి రీజన్ నాకు తెలియదని భోలే షావలి తల్లి చెప్పుకొచ్చారు. నా కొడుకు నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాడని ఆమె కామెంట్లు చేశారు. నా రక్తం ఉడుకుతోందని ఆమె చెప్పుకొచ్చారు. ఎక్కడికి వెళ్లినా నా కొడుకు నా ఆశీర్వాదాలు తీసుకొని వెళతాడని ఆమె అన్నారు.
బిగ్ బాస్ హౌస్ లో నా కొడుకుతో ఎవరూ మాట్లాడటం లేదని భోలే షావలి తల్లి పేర్కొన్నారు. నా కొడుకు కలుపుకుపోదామని చూస్తున్నా వాళ్లు దూరం పెడుతున్నారని భోలే షావలి తల్లి చెప్పుకొచ్చారు. భోలే షావలి తల్లి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.
భోలే షావలి (Bhole Shavali) వరుస వివాదాల్లో చిక్కుకుంటూ బిగ్ బాస్ హౌస్ లో వార్తల్లో నిలవడం ఆయన ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది. టాప్ 5 కంటెస్టెంట్ల జాబితాలో భోలే షావలి నిలుస్తారో లేదో చూడాల్సి ఉంది. బిగ్ బాస్ నిర్వాహకులు ఒకే సమయంలో అందరు కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించి ఉంటే బాగుండేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుస సినిమాలతో బన్నీ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!