Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » శివ కందుకూరి ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ టెర్రిఫిక్ థ్రిల్లింగ్ ట్రైలర్ గ్రాండ్ లాంచ్

శివ కందుకూరి ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ టెర్రిఫిక్ థ్రిల్లింగ్ ట్రైలర్ గ్రాండ్ లాంచ్

  • February 10, 2024 / 03:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శివ కందుకూరి ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ టెర్రిఫిక్ థ్రిల్లింగ్ ట్రైలర్ గ్రాండ్ లాంచ్

శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. స్నేహాల్ .. శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో టీజర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. అలాగే న్యూ ఏజ్ స్టార్ కంపోజర్ శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం టైటిల్ సాంగ్ వైరల్ అయ్యింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ రోజు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ చిత్రం ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.

‘ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు సమీపంలో మునుపెన్నడూ చూడని దారుణ హత్య జరిగింది. ఈ హత్యలని దిష్టి బొమ్మ హత్యలుగా పోలీసులు పేర్కొన్నారు”అనే న్యూస్ బులిటెన్ వాయిస్ మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఒక్క క్లూ కూడా వదలకుండా హత్యలు చేసే ఓ సీరియల్ కిల్లర్ కేసుని డిటెక్టివ్ భూతద్ధం భాస్కర్ నారాయణ(శివ కందుకూరి) ఎలా పరిష్కరించాడనేది చాలా థ్రిల్లింగ్ గా ట్రైలర్ లో ప్రజెంట్ చేశారు. అసలు సీరియల్ కిల్లర్ మనిషా రాక్షసుడా ? అని సస్పెన్స్ ని రేకెత్తిస్తూ ట్రైలర్ చివర్లో వచ్చిన సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ చాలా ఎక్సయిటింగా వున్నాయి. డిటెక్టివ్ భూతద్ధం భాస్కర్ నారాయణ గా శివ కందుకూరి పెర్ఫార్మెన్స్ చాలా ప్రామెసింగా వుంది. దర్శకుడు పురుషోత్తం రాజ్ కథని చాలా ఎంగేజింగ్ గా చెప్పారని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్రిలియంట్ గా వుంది. విజివల్స్, ప్రొడక్షన్ వాల్యుస్ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తనికి ట్రైలర్ సినిమాని చాలా క్యురియాసిటీని పెంచింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. రాజ్ కందుకూరి గారు నా కెరీర్ బిగినింగ్ లో ఎంతో సపోర్ట్ చేశారు. ఇది నా సినిమా వేడుకలానే అనిపిస్తుంది. ట్రైలర్ లో శివ చాలా ప్రామెసింగ్ గా కనిపిస్తున్నారు. ట్రైలర్ కూడా చాలా ఆసక్తికరంగా వుంది. శ్రీ చరణ్ నేపధ్య సంగీతం అద్భుతంగా చేశారు. దర్శకుడు పురుషోత్తం రాజ్ సినిమా చాలా గ్రిప్పింగ్ గా తీశారని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతోంది. టైటిల్ లోనే తన అభిరుచి కనిపిస్తోంది. టీం అందరినీ ఆల్ ది బెస్ట్. మార్చి 1 సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అందరూ తప్పకుండా థియేటర్స్ లో చూడాలి” అని కోరారు.

హీరో శివ కందుకూరి మాట్లాడుతూ.. ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ కంటెంట్ పై చాలా నమ్మకంగా ఉన్నాము. సినిమాని ప్రేక్షకులకు చూపించాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. ఇంత మంచి కంటెంట్ సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఆనందంగా వుంది. మార్చి 1న కొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తామనే నమ్మకం వుంది. చాలా యునిక్ ఎలిమెంట్స్ తో తీసిన చిత్రమిది. పురాణాలతో ముడిపడిన ఎలిమెంట్స్ ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతిని పంచుతాయి. దర్శకుడికి పురాణాలపై చాలా మంచి పట్టువుంది. తను చాలా పెద్ద దర్శకుడు అవుతారు. నిర్మాతలు చాలా ప్యాషన్ తో ఈ సినిమా చేశారు. సినిమాకి కావాల్సిన ప్రతిది ఎక్కడా రాజీపడకుండా తీశారు. మా సినిమాకు సపోర్ట్ చేయానికి వచ్చిన విశ్వక్ సేన్ గారికి ధన్యవాదాలు. అలాగే రాహుల్ యాదవ్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. సినిమాని బలంగా నమ్మారు. ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ యునిక్ క్రైమ్ థ్రిల్లర్. మార్చి 1న వస్తోంది. మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. మా సినిమాని కూడా గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం వుంది. దయచేసి అందరూ థియేటర్ లో సినిమా చూడాలి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. భూతద్ధం భాస్కర్ నారాయణ’సినిమా, పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది’ అన్నారు.

దర్శకుడు పురుషోత్తం రాజ్ మాట్లాడుతూ.. ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ అందరూ ఎంజాయ్ చేసే చిత్రం. అందరి ఇంటిముందు ఒక దిష్టి బొమ్మ వుంటుంది. ఆ దిష్టి బొమ్మ గురించే ఈ కథ. అదేంటి అనేది సినిమా చూస్తున్నపుడు తెలుస్తుంది. ట్రైలర్ లో రివిల్ చేయని ట్విస్ట్ లు సినిమాలో చాలా వున్నాయి. మర్చి 1న థియేటర్ లో రివిల్ అవుతాయి” అన్నారు

హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ.. చాలా డిఫరెంట్ మూవీ ఇది. ఇందులో వుంటే కంటెంట్ చాలా యూనిక్ గా వుంటుంది. ఇందులో చాలా బలమైన పాత్ర చేశాను. దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. శివ చాలా డిఫరెంట్ రోల్ చేశారు. తప్పకుండా సినిమా అందరినీ అలరిస్తుంది” అన్నారు.

నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. చాలా డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. ఖచ్చితంగా మంచి విజయం సాధించి, శివకి మంచి విజయాన్ని ఇస్తుందనే నమ్మకం వుంది. ఇందులో చాలా కొత్త ఎలిమెంట్ ని ప్రయత్నించారు. అది ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది. నిర్మాతలు ప్యాషన్ తో ఈ సినిమా చేశారు. ఈ వేడుకకు విచ్చేసిన విశ్వక్ సేన్ కి థాంక్స్” తెలిపారు.

చిత్ర నిర్మాతలు శశిధర్, స్నేహల్ మాట్లాడుతూ.. విశ్వక్ సేన్, రాజ్ కందుకూరి, రాహుల్ గారికి కి ధన్యవాదాలు. టీం అందరికీ థాంక్స్. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. మార్చి 1న సినిమా వస్తోంది. మంచి థ్రిల్లర్ ఇది. ఖచ్చితంగా ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు” అన్నారు

నటీనటులు : శివ కందుకూరి, రాశి సింగ్ అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత తదితరులు
దర్శకత్వం – పురుషోత్తం రాజ్
నిర్మాతలు – స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై
సంగీతం – శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్
డీవోపీ – గౌతమ్ జార్జ్
ఆర్ట్ డైరెక్టర్ – రోషన్ కుమార్
కాస్ట్యూమ్స్ – అశ్వంత్ & ప్రతిభ
పీఆర్వో: ఏలూరు శ్రీను, తేజస్వి సజ్జా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhoothaddam Bhaskar Narayana

Also Read

Lokesh Kanagaraj: కమల్-రజనీ..లతో లోకేష్ మల్టీస్టారర్…?

Lokesh Kanagaraj: కమల్-రజనీ..లతో లోకేష్ మల్టీస్టారర్…?

నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

Coolie Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదనిపించిన ‘కూలీ’

Coolie Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదనిపించిన ‘కూలీ’

War 2 Collections: మొదటి సోమవారం.. ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చిన ‘వార్ 2’

War 2 Collections: మొదటి సోమవారం.. ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చిన ‘వార్ 2’

Court: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘కోర్ట్’ డైరెక్టర్

Court: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘కోర్ట్’ డైరెక్టర్

This week Releases : ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This week Releases : ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Lokesh Kanagaraj: కమల్-రజనీ..లతో లోకేష్ మల్టీస్టారర్…?

Lokesh Kanagaraj: కమల్-రజనీ..లతో లోకేష్ మల్టీస్టారర్…?

నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

Ram Charan: ‘ధూమ్ 4’ లో రాంచరణ్?

Ram Charan: ‘ధూమ్ 4’ లో రాంచరణ్?

Ar Murugadoss: ‘సికందర్’ ప్లాప్ అవ్వడానికి సల్మాన్ ఖానే కారణం: మురుగదాస్

Ar Murugadoss: ‘సికందర్’ ప్లాప్ అవ్వడానికి సల్మాన్ ఖానే కారణం: మురుగదాస్

Mass Jathara: డిస్ట్రిబ్యూటర్స్ ని కూల్ చేయడానికే అలా చెప్పారా.. ‘మాస్ జాతర’ రిలీజ్ పై క్లారిటీ ఇదే

Mass Jathara: డిస్ట్రిబ్యూటర్స్ ని కూల్ చేయడానికే అలా చెప్పారా.. ‘మాస్ జాతర’ రిలీజ్ పై క్లారిటీ ఇదే

Sridevi: ప్రభాస్ మాట్లాడే మాటలు అర్థం కావు : శ్రీదేవి(ఈశ్వర్ హీరోయిన్)

Sridevi: ప్రభాస్ మాట్లాడే మాటలు అర్థం కావు : శ్రీదేవి(ఈశ్వర్ హీరోయిన్)

trending news

Lokesh Kanagaraj: కమల్-రజనీ..లతో లోకేష్ మల్టీస్టారర్…?

Lokesh Kanagaraj: కమల్-రజనీ..లతో లోకేష్ మల్టీస్టారర్…?

2 hours ago
నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

2 hours ago
Coolie Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదనిపించిన ‘కూలీ’

Coolie Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదనిపించిన ‘కూలీ’

17 hours ago
War 2 Collections: మొదటి సోమవారం.. ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చిన ‘వార్ 2’

War 2 Collections: మొదటి సోమవారం.. ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చిన ‘వార్ 2’

18 hours ago
Court: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘కోర్ట్’ డైరెక్టర్

Court: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘కోర్ట్’ డైరెక్టర్

19 hours ago

latest news

Bollywood: తారక్‌ ఒక్కడే కాదు.. ఇంతకుముందు చాలామంది ‘బాలీ’ గోతులో పడినోళ్లే..

Bollywood: తారక్‌ ఒక్కడే కాదు.. ఇంతకుముందు చాలామంది ‘బాలీ’ గోతులో పడినోళ్లే..

19 hours ago
Flop Reason: ఆ సినిమాలకు తప్పు హీరోది.. ఇప్పుడు డైరక్టర్‌దా? ఇవేం డబుల్‌ స్టాండర్డ్స్‌ బాబూ!

Flop Reason: ఆ సినిమాలకు తప్పు హీరోది.. ఇప్పుడు డైరక్టర్‌దా? ఇవేం డబుల్‌ స్టాండర్డ్స్‌ బాబూ!

21 hours ago
Thama Teaser : ‘థామా’ టీజర్ రివ్యూ.. రక్తం తాగుతున్న రష్మిక

Thama Teaser : ‘థామా’ టీజర్ రివ్యూ.. రక్తం తాగుతున్న రష్మిక

21 hours ago
Tickets Rate: దిక్కుతోచని స్థితిలో టాలీవుడ్‌.. ఇబ్బందిపెడుతున్న టికెట్‌ రేట్లు.. ప్లాన్‌ మార్చాల్సిందేనా?

Tickets Rate: దిక్కుతోచని స్థితిలో టాలీవుడ్‌.. ఇబ్బందిపెడుతున్న టికెట్‌ రేట్లు.. ప్లాన్‌ మార్చాల్సిందేనా?

21 hours ago
Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version