Mounika: మంచు ఫ్యామిలీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కొత్త కోడలు.!

తల్లిదండ్రుల మరణం, రాజకీయం, ఎదుర్కొన్న దెబ్బలు, తాజాగా మనోజ్‌తో పెళ్లి తదితర అంశాల గురించి వెన్నెల కిశోర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘అలా మొదలైంది’ షోలో చెప్పుకొచ్చారు. అమ్మ చనిపోవడం, ఆ రెండో రోజులకే రోడ్‌ క్యాంపెయిన్‌లో పాల్గొవల్సి రావడం, అక్క, నేను, తమ్ముడు, నాన్న ఇలా ప్రజా జీవితంలోనే ఉండిపోయాం. ఎన్నికలు కావడంతో ‘ఏం చేద్దాం’ అనుకునే సమయం కూడా లేదు. ఆ తర్వాత అక్క రాజకీయాల్లోకి వచ్చారు. నేను నా జీవితంలో ముందుకు వెళ్లిపోయా. నాన్న బాగా ఇబ్బంది పడ్డారు.

మూడేళ్లకు నాన్న కూడా మాకు దూరమాయ్యరు. ఆ రెండు సంఘటనలతో ‘జీవితంలో ఇంతకన్నా ఇంకేం జరుగుతుంది’ అన్న తెగింపు వచ్చింది. అమ్మ చనిపోయిన కొన్ని రోజుల తర్వాత ఆమె జయంతి రోజున చాలా ఒంటరిగా ఫీలయ్యా. కుటుంబ పెద్దల్ని కోల్పోయాం. జీవితం శూన్యంగా అనిపించింది. పైగా నా వ్యక్తిగత జీవితంలో సమస్యలు.. ఇవన్నీ మానసికంగా కుంగదీశాయి. అప్పుడు అమ్మను తలుచుకుని ‘అమ్మా.. నువ్వు ఎక్కడ ఉన్నా, నాకేం కావాలో నీకు తెలుసు.

నీ ఆశీస్సులు నాకు కావాలి. అంతా నీకే వదిలేస్తున్నా. నా జీవితంలో నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నానో అక్కడ ఉంచు’ అని కోరుకున్నా. అదే రోజు మనోజ్‌ ఆళ్లగడ్డ వచ్చారు. ఆయన వస్తారన్న విషయం నాకు తెలీదు. నాకు అండగా నిలిచాడు. మానసికంగా కుంగిపోయాను నాకు మనోజ్‌ ఎంతో చేశాడు. మామయ్య మోహన్‌బాబుగారు సరదాగా మనిషి. పెళ్లి కాకముందు ఇంటికి వెళ్లినప్పుడు అన్నం తినిపించారు. నన్నూ, నా కొడుకు ధైరవ్‌ను సొంతవాళ్లలా దగ్గరకు తీసుకున్నారు.

అది నాకు దేవుడిచ్చిన వరం. అమ్మ చనిపోయినప్పుడు నుంచి ఆంటీ నాతో ఫోన్‌ టచ్‌లో ఉంటారు. ధైర్యం చెబుతుంటారు. కోడలిగా కాకుండా కూతురుగా కుటుంబంలోకి ఆహ్వానించారు. అంతకుమించి నాకేం కావాలి. ఇక లక్ష్మీ గురించి ఏం చెప్పాలి. మా ఇద్దరి మధ్య అనుబంధాన్ని ఎలా వర్ణించాలో తెలియడం లేదు. మాది అందమైన అనుబంధం. నాకు అమ్మ స్థానంలో నిలబడింది. నన్ను ఒక చిన్నపిల్లలా చూస్తుంది. ఆమే నాకు అన్నీ.

ఇక నా భర్త మనోజ్‌ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మాకు ‘ఎప్పుడూ సమయానికి ఇంట్లో ఉండరు’ అనే బిరుదు ఉంది. అలాంటిది మనోజ్‌ ఇంట్లో అంతా క్రమశిక్షణగా ఉంటారు. అనుకున్న సమయానికి రెండు నిమిషాల ముందే ఉండటం అక్కడే నేర్చుకున్నా. కమిట్‌మెంట్‌, సిన్సియారిటీ మనోజ్‌ నుంచి నేర్చుకున్నవే అని మౌనిక అన్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus