హీరోయిన్ల కంటే నాకేం తక్కువ అని చూపిస్తోందా ?

పువ్వులన్నాక వాడిపోవడం.. హీరోయిన్లన్నాక ఫేడవుట్ అయిపోవడం చాలా కామన్. కానీ.. తాను వాడిపోయే పువ్వును కానని.. ఫేడవుట్ అయ్యే హీరోయిన్ ను అస్సలు కాదని చెప్పకనే చెబుతోంది భూమిక. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి యంగ్ యాక్టర్స్ తో మాత్రమే కాక చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ హీరోస్ తోనూ నటించిన ఘనత సొంతం చేసుకున్న భూమిక అనంతరం నిర్మాతగా మారి రెండు సినిమాలు కూడా నిర్మించించి. అఫ్కోర్స్ ఆ సినిమాలతో భారీగా నష్టపోయిందనుకోండి. ఆ తర్వాత భారత్ ఠాకూర్ ను పెళ్లాడి కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించింది కానీ.. ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా చిన్న సినిమాల్లో నటించడం మొదలెట్టింది.

కొన్నాళ్ళకు హీరోయిన్ గా ఆఫర్లు తగ్గడంతో సపోర్టింగ్ రోల్స్ ప్లే చేయడం కూడా స్టార్ట్ చేసింది. హిందీ, తమిళ, తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేయడం కూడా మొదలెట్టింది. నానితో కలిసి “మిడిల్ క్లాస్ అబ్బాయి”లో వదిన పాత్ర పోషించింది. ఆ తర్వాత “సవ్యసాచి”లోనూ నాగచైతన్యకు అక్కగా నటించింది. ఈ రెండు సినిమాలూ ఆమెకు పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. దాంతో అటు హీరోయిన్ రోల్స్ హ్చేయలేక.. ఇటు క్యారెక్టర్ రోల్స్ రాక ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్ లో.. ఒక కొత్త ఫోటోషూట్ చేయించుకుంది. బ్లాక్ డ్రెస్ లో థైస్ కనిపించేలా ఒక ఫోటోషూట్ చేయించుకొని ఇండస్ట్రీలోని కీ పర్సన్స్ కి పంపింది. ఒరిజినల్ ఫోటోస్ ఇంకా బయటకి రాలేదు కానీ.. మేకింగ్ టైమ్ లో తీసిన కొన్ని ఫోటోస్ మాత్రం లీక్ అయ్యాయి. ఆ ఫోటోల్లో భూమికను చూసినవాళ్ళందరూ.. ఈవిడ ఈ ఏజ్ లో కూడా సెక్సీగా ఉంది అని పొగుడుతున్నారు. మరి ఈ కొత్త ఫోటోలు ఆమెకు ఏమైనా ఆఫర్లు తెచ్చిపెడతాయో లేదో చూడాలి.

3

4

5

6

7

8

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus