2019.. రౌడీ బాబుకి పెద్ద డిజప్పాయింట్మెంటే..!

గత ఏడాది.. 2018 లో ‘గీత గోవిందం’ టాక్సీవాలా’ ‘మహానటి’ .. వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ లు అవ్వడంతో విజయ్ దేవరకొండ.. స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. మధ్యలో వచ్చిన ‘నోటా’ సినిమా డిజాస్టర్ అయినా.. విజయ్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. అయితే 2019లో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయిపొయింది. ఎంతో కష్టపడి చేసిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం.. మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది.. కానీ ఆ తరువాత దుకాణం సర్దేసింది.

ఇక విజయ్.. ‘కింగ్ ఆఫ్ ది హిల్’ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ను స్థాపించి.. తన స్నేహితుడు మరియు డైరెక్టర్ అయిన తరుణ్ భాస్కర్ తో ‘మీకు మాత్రమే చెప్తా’ అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం నిర్మాత విజయ్ కు మంచి లాభాలే అందించినప్పటికీ.. బయ్యర్స్ కు మాత్రం కొంత వరకూ నష్టాల్నే మిగిల్చింది. ఇక తన తమ్ముడు హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘దొరసాని’ చిత్రం కూడా ప్లాప్ అయ్యింది. మరి విజయ్ కు వచ్చే 2020 వ సంవత్సరం అయినా కలిసొస్తుందేమో చూడాలి..!

ఈ ఏడాది ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు!
2019లో మరణించిన తారలు?
ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus