Movies: అసలైన సినిమాల పండుగ డిసెంబర్లోనే..!

2025 సంక్రాంతి కంటే ఓ నెల ముందుగానే సినిమాల పండుగ వచ్చేలా ఉంది. అవును ఆల్రెడీ డిసెంబర్ 6 కి ‘పుష్ప 2’ (Pushpa 2)  విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా రిలీజ్ పై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నా..కచ్చితంగా ఆ డేట్ కి రిలీజ్ చేసి తీరతామని నిర్మాతలైన ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు బలంగా చెబుతున్నారు. ఒకవేళ నిజంగా ఆ సినిమా  (Movies) రిలీజ్ అయితే .. బాక్సాఫీస్ వద్ద అసలైన జాతర మొదలవుతుంది.

2 వారాల పాటు ఈ సినిమా (Movies) కలెక్షన్స్ కి డోకా ఉండకపోవచ్చు. మరోపక్క..మంచు విష్ణు పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’ (Kannappa) కూడా డిసెంబర్ 10 ఆ టైంలోనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క తమిళంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘విడుదలై పార్ట్ 2’ ని డిసెంబర్ 20 న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. వెట్రిమారన్ (Vetrimaaran) డైరెక్ట్ చేస్తున్న ఈ సీక్వెల్ పై మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే ‘ది లయన్ కింగ్’ ప్రీక్వెల్ అయినటువంటి ‘ముఫాసా’ కూడా డిసెంబర్ 20 నే విడుదల కాబోతుంది.

Movies

దీనికి కూడా పాన్ ఇండియా అప్పీల్ ఉంది. పైగా మహేష్ బాబు (Mahesh Babu)  వాయిస్ ఓవర్ ఇవ్వడంతో.. మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక లాస్ట్…బాట్ నాట్ ఎట్ ఆల్ లీస్ట్.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar)  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  ని కచ్చితంగా డిసెంబర్ 20 న రిలీజ్ చేస్తున్నట్టు దిల్ రాజు (Dil Raju)  టీం చెబుతుంది. సో ఈ డిసెంబర్ మామూలుగా ఉండదు.

ఎన్టీఆర్, ఎస్జే సూర్య కాంబో కావాలంటున్న ఫ్యాన్స్.. సాధ్యమేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus