Jr NTR,SJ Surya: ఎన్టీఆర్, ఎస్జే సూర్య కాంబో కావాలంటున్న ఫ్యాన్స్.. సాధ్యమేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కెరీర్ లోని స్పెషల్ సినిమాలలో టెంపర్ (Temper) మూవీ ముందువరసలో ఉంటుంది. వరుస ఫ్లాపులతో తారక్ కెరీర్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో టెంపర్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పూరీ జగన్నాథ్  (Puri Jagannadh)  డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు వక్కంతం వంశీ(Vakkantham Vamsi)  కథ అందించగా ఈ సినిమా నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలను అందుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో దయా అనే పాత్రలో కనిపించారు.

Jr NTR, SJ Surya

మరోవైపు సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram)  సినిమాలో ఎస్జే సూర్య దయానంద్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో ఎస్జే సూర్య  (SJ Suryah)  నటనను ప్రశంసిస్తూ క్రిటిక్స్ నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సీరియస్ రోల్స్ లో ఎస్జే సూర్యకు ఎవరూ సాటిరారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్, ఎస్జే సూర్య కాంబోలో సినిమా కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పై టెంపర్ దయా వర్సెస్ సరిపోదా దయా కాంబోలో సీన్స్ ఉంటే మామూలుగా ఉండవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ తలచుకుంటే ఈ కాంబినేషన్ సెట్ కావడం కష్టమేమీ కాదు. జూనియర్ ఎన్టీఆర్ అతి త్వరలో దేవర (Devara) ప్రమోషన్స్ తో బిజీ కానున్నారు. దేవర సినిమా థియేట్రికల్ హక్కులు 200 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.

నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. నెట్ ఫ్లిక్స్ ఈ మధ్య కాలంలో క్రేజీ సినిమాల డిజిటల్ హక్కులను కొనుగోలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఎన్టీఆర్ దేవర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన కొత్త సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ సైతం ఇస్తారేమో చూడాల్సి ఉంది.

రెమ్యునరేషన్ అమాంతం పెంచేసిన నాగ్.. ఆ హీరోలను మించి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus