కొన్నాళ్లుగా మోహన్ బాబు ఏదో ఒక కాంట్రోవర్సీతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. మనోజ్ విషయంలో కుటుంబమంతా రోడ్డు కెక్కింది. పోలీసుల కౌన్సిలింగ్ తో వాళ్ళు సైలెంట్ గా ఉన్నప్పటికీ.. మరోపక్క శ్రీ విద్యానికేతన్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.
వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా రంగంపేటలో మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ ఉన్న సంగతి తెలిసిందే.ఇది మోహన్ బాబు యూనివర్సిటీగా (MBU) గా పిలవబడుతుంది. ఇంజినీరింగ్, గ్రీన్ ఫీల్డ్.. వంటి కోర్సులు ఇక్కడ నిర్వహిస్తారు. ఇందులో 70 శాతం సీట్లు, గ్రీన్‌ఫీల్డ్ కోర్సుల్లో 35 శాతం సీట్లు భర్తీ చేయబడ్డాయట.
వీటిని హెచ్‌ఈసీ (HEC) నిర్ణయిస్తున్నట్టు సమాచారం.ఇదిలా ఉంటే.. 2022-23 విద్యా సంవత్సరానికి గాను అంటే 2023 సెప్టెంబర్ 30 వరకు, రూ.26.17 కోట్లు ఫీజుల రూపంలో అత్యధికంగా వసూలు చేసిందట MBU.
మెస్ చార్జీలు అంటూ డే స్కాలర్ స్టూడెంట్స్ నుండి, అటెండెన్స్ తక్కువగా ఉందని మరికొంత వసూలు చేయడం హాట్ టాపిక్ అయ్యింది.ఆంధ్రప్రదేశ్ లోని పేరెంట్స్ అసోసియేషన్ కింద ఈ ఫ్రాడ్ బయటపడినట్టు అంతా చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ హెచ్ ఈ సీ.. చాలా లోపాలు ఉన్నట్లు గుర్తించిందట. అటెండెన్స్ విషయంలో, ఒరిజినల్ సర్టిఫికెట్లు విషయంలో చాలా అవకతవకలు గుర్తించింది.
15 రోజుల్లో అక్రమంగా విద్యార్థుల నుండి వసూలు చేసిన ఫీజులు వారికి తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ క్రమంలో యూనివర్సిటీ అధినేతలు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసినా లాభం లేకపోయింది. ఈ వ్యవహారాన్ని అక్టోబర్ 14 కి వాయిదా వేసింది. మరోపక్క MBU గుర్తింపుని సైతం రద్దు చేసి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి తాత్కాలిక బాధ్యతలు అప్పగించాలని హెచ్ ఈ సి సూచించినట్టు స్పష్టమవుతుంది.