Darshan: దర్శన్‌ బెయిల్‌పై బయటికొచ్చి చేసిన పని ఇదేనా? అందుకే డేట్‌ ఇచ్చారా?

కన్నడ స్టార్‌ యాక్టర్‌ దర్శన్‌ను కొన్ని నెలల క్రితం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన హీరోగా రూపొందుతున్న సినిమాల పరిస్థితి ఏంటి అనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఆ క్రమంలో వినిపించిన సినిమా పేరే ‘డెవిల్‌’. ఈ సినిమా షూటింగ్‌ సగం అయిన తర్వాతే దర్శన్‌ను హత్య కేసులో పోలీసులు అరెస్టు చేసి, జైలులో పెట్టారు. అయితే ఇప్పుడు ఆ సినిమా విడుదలకు సిద్ధమైంది. సినిమాను డిసెంబరు 12న విడుదల చేస్తామని చిత్రబృందం ఇటీవల వెల్లడించింది. దీంతో సినిమా ఎప్పుడు పూర్తయింది అనే చర్చ మొదలైంది.

Darshan

దీనికి ఆన్సర్‌గా ఇటీవల ఆయన బెయిల్‌పై బయటకు వచ్చినప్పుడు చేసిన పనుల్లో ఇదొకటి అని శాండిల్‌వుడ్‌ మీడియా అంటోంది. సినిమా మొదటి ఆడియో సింగిల్ ఇప్పటికే రిలీజ్‌ చేశారు. దానికి మంచి స్పందన కూడా వచ్చింది. ఇప్పుడు రెండో లిరికల్ సాంగ్‌ వీడియో త్వరలో రిలీజ్‌ చేస్తారట. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీంతో సినిమా మధ్యలో ఆగిపోతే నిర్మాతకు చాలా లాస్‌ అనుకున్నారంతా. కానీ బెయిల్ టైంలో దర్శన్‌ ఈ సినిమా షూటింగ్‌ కానిచ్చేసి ఉంటారని అంటున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక దర్శన్‌ను అరెస్టు ఎందుకు చేశారు అనే విషయానికొస్తే.. అభిమాని రేణుక స్వామిని హత్య చేసిన కేసులో దర్శన్‌ను అరెస్టు చేశారు. తన స్నేహితురాలు పవిత్రకు అసభ్య సందేశం పంపాడన్న కారణంతో అతడిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్శన్‌, ఆయన స్నేహితురాలు పవిత్రగౌడ సహా 15 మందిని అరెస్టు చేశారు. రేణుకాస్వామిపై అత్యంత పాశవికంగా దాడి చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. అతడికి కరెంట్‌ షాక్‌ కూడా పెట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.

ఈ కేసు విషయంలో మధ్యలో దర్శన్‌ బెయిల్‌ మీద బయటకొచ్చారు. అయితే సుప్రీం కోర్టు ఆగస్టులో బెయిల్‌ రద్దు చేయడంతో మళ్లీ జైలుకు వెళ్లిపోయారు.

‘తెలుసు కదా’ వెనుక మరో కుర్ర హీరో.. ఆయన మాటలతోనే సిద్ధుకి..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus