‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

తెలుగులో స‌క్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగ‌ర్స్‌’ (Save The Tigers).. రిలీజైన మూడు సీజ‌న్స్ ఆడియెన్స్‌ను అల‌రించాయి. దీంతో మేక‌ర్స్ ఇప్పుడీ సిరీస్‌లో భాగంగా నాలుగో సీజ‌న్‌ను రూపొందించ‌టానికి స‌న్నాహాలు సిద్ధం చేస్తున్నారు.

జూన్ 19న సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 ప్ర‌ముఖ ఓటీటీ ఛానెల్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిన సంగ‌తి తెలిసిందే. తొలి రెండు సీజ‌న్స్ పంథాలోనే సీజ‌న్ 3 కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌టంతో షో ర‌న్న‌ర్ మ‌హి వి.రాఘ‌వ్ చాలా సంతోషంగా ఉన్నారు. పెళ్లి త‌ర్వాత మూడు జంట‌ల మ‌ధ్య ఉండే చిన్న చిన్న గిల్లిక‌జ్జాల‌ను కామెడీగా తెర‌కెక్కించిన తీరు ఆడియెన్స్‌కు చాలా బాగా క‌నెక్ట్ అయ్యింది. మ‌రీ ముఖ్యంగా సీజ‌న్‌3లో చూపించిన కాస్మిక్ ట్విస్ట్ సిరీస్‌కు ఓ కొత్త కోణాన్ని తీసుకొచ్చింది.

సేవ్ ది టైగ‌ర్స్ మూడు సీజ‌న్స్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ రావ‌టంతో మేక‌ర్స్ ఇప్పుడు నాలుగో సీజ‌న్‌ను రూపొందించ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే సీజ‌న్‌4లో ఓ స్టార్ హీరోను న‌టింప‌చేయ‌టానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. చిన్న‌పాటి గిల్లిక‌జ్జాలు, ఈగో స‌మ‌స్య‌ల‌తో ఉండే ఈ మూడు జంట‌ల మ‌ధ్య స్టార్ హీరో పాత్ర ఎక్క‌డ‌, ఎలా ఉండ‌బోతుందోన‌నే ఆస‌క్తి క‌లుగుతోంది. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేయ‌నున్నారు.

ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మై స్పంద‌న‌ను రాబ‌ట్టుకున్న సేవ్ ది టైగ‌ర్స్ స‌క్సెస్‌ను నాలుగో సీజ‌న్‌తోనూ కంటిన్యూ చేసేలా మేకర్స్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఈ సీజ‌న్ 4ను గ్రాండియ‌ర్‌గా రూపొందించ‌టానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus