‘బిగ్ బాస్ 5’ కి మళ్ళీ సొహైల్‌, అరియానా, మోనాల్‌, దివి, బాబా..!

  • October 28, 2021 / 05:16 PM IST

పండగ వచ్చిందంటే చాలు థియేటర్లలో కంటే బుల్లితెర పైనే ఎక్కువ సందడి ఉంటుంది.ఈటీవీ,స్టార్ మా, జీ తెలుగు వంటి చానెల్స్ లో టెలికాస్ట్ అయ్యే సీరియల్ ఆర్టిస్ట్ లు కామెడీ షోల ఆర్టిస్ట్ లు అంతా ఒక్కచోట చేరి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. ఈ వేడుకలను ఎంతో ఖర్చు పెట్టి ఆ షో నిర్మాతలు నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే బాటలో ‘బిగ్‌బాస్‌’ నిర్వాహకులు కూడా రెడీ అవుతున్నారా? అనే చర్చ నడుస్తుంది.

ఎందుకంటే దీపావళికి ‘బిగ్ బాస్’ నిర్వాహకులు పాత బిగ్ బాస్ కంటెస్టెంట్ లతో వేడుకలు జరపాలని డిసైడ్ అయ్యారట.హౌస్మేట్స్ లో మరింత జోష్ నింపేందుకు వారు ఈ ప్లాన్ ను అమలు చేస్తున్నట్టు సమాచారం! అందుతున్న సమాచారం ప్రకారం.. దీపావళి స్పెషల్‌ ఎపిసోడ్‌లో సీజన్3 కి చెందిన ఫైనలిస్ట్ బాబా భాస్కర్‌, నాలుగో సీజన్‌ కంటెస్టెంట్లు అరియానా గ్లోరీ, మోనాల్‌ గజ్జర్‌, దివి, సోహైల్‌, ముక్కు అవినాష్‌ వంటి వారు పాల్గొంటారట.

వీరంతా హోస్ట్ నాగార్జునతో కలిసి ఎంజాయ్ చేస్తారా లేక హౌస్ లోకి వెళ్ళి హౌస్మేట్స్ తో సందడి చేయిస్తారా? అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్ గా ఉంది. హౌస్మేట్స్ కు ఎలా ఉన్నా.. ప్రేక్షకులకు మాత్రం ఆరోజు కన్నుల పండుగగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ‘బిగ్ బాస్5’ ప్రారంభమయ్యి 8 వారలు పూర్తికావస్తోంది. ఆల్రెడీ 7 మంది ఎలిమినేట్ అయ్యారు. ఈ 8వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus