బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ఆదివారం హైలైట్స్‌ ఏంటంటే?

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో రెండో వారం ముగిసింది. చప్పగా సాగిన రెండో వారం.. వీకెండ్‌కి వచ్చేసరికి నాగార్జున కోపం, వివిధ టాస్క్‌లతో సీరియస్‌నెస్‌ వచ్చింది. కళ్యాణి ఎలిమినేట్‌ అవ్వగా, హారిక ఫేక్‌ ఎలిమినేషన్‌లో డోర్‌ వరకు వెళ్లి… మళ్లీ ఇంట్లోకి వెళ్లింది. ఇంకా ఆదివారం ఏం జరిగిందంటే…

* ఈ వారం ఎలిమినేట్‌ అయిన కళ్యాణికి నాగార్జున ఓ టాస్క్‌ ఇచ్చాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లో టాప్‌ 5 అనిపించే ఐదుగురు, బోటమ్‌ 5 అనే ఐదుగురు పేర్లు, వివరాలను చెప్పమని అడిగాడు. ఈ క్రమంలో కళ్యాణి కొందరి విషయంలో మంచిగా చెప్పగా, ఇంకొందరి విషయాల్లో షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. హారికకు ఫస్ట్‌ ప్లేస్‌ ఇవ్వగా… దేవీతో జాగ్రత్తగా ఉండమని చెప్పింది.

Click Here->కళ్యాణి మిగిలిన వారి గురించి ఏం చెప్పిందంటే?

* వచ్చే వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి ఎవరిని మీరు నామినేట్‌ చేస్తారు అంటూ కళ్యాణికి బిగ్‌ బాంబ్‌ ఇచ్చాడు నాగ్‌. తొలుత షాక్‌ అయినా తర్వాత దేవీ నాగవల్లిని నామినేట్‌ చేసింది.

* ఎలిమినేషన్‌ టెన్షన్‌ నుంచి బయటపడేయానికి, ఇంట్లో ఫన్‌ క్రియేట్‌ చేయడానికి డాగ్ అండ్‌ ది బోన్‌ గేమ్‌ను తీసుకొచ్చారు. మధ్యలో సర్కిల్‌ పెట్టి అందులో బోన్‌ పెట్టారు. పాట ప్లే చేసి.. అది ఆగిపోతే బోన్‌ తీసుకోవాలనేది ఆట. ఈ ఆటలో గెలిచినవారికి బోన్‌ దక్కితే. మరి ఓడిన వాళ్లకు ఫన్నీ టాస్క్‌ ఇచ్చారు.

Click Here-> డాగ్‌ అండ్‌ ది బోన్‌ ఆట ఎలా సాగిందంటే?

* బెలూన్‌ బ్లాస్ట్‌ టాస్క్‌లో అభిజీత్‌, కుమార్‌ సాయి డేంజర్‌ జోన్‌ నుంచి బయటపడ్డారు. అంటే ఎలిమినేషన్‌ నుంచి సేవ్‌ అయ్యారు. ఆ తర్వాత కాసేపటికే అమ్మ రాజశేఖర్‌ను సేవ్‌ చేశాడు నాగ్‌. ఓ రాజపత్రం లాంటి లెటర్‌ తీసుకొచ్చి అందులో ఉన్న నోయల్‌, సోహైల్‌ పేర్లను చదివి సేవ్‌ అయినట్లు ప్రకటించింది దేవీ నాగవల్లి.

* ఎలిమినేషన్‌ జోన్‌లో మిగిలి ఉన్న మోనాల్‌, హారికను ఒకరిని రక్షించే అవకాశం నాగార్జున నామినేట్‌ కాని హౌస్‌మేట్స్‌కు ఇచ్చాడు. అఖిల్, మెహబూబ్‌, లాస్య, అరియానా, సుజాత, దివి, దేవీ కలసి ఆ ఇద్దరిలో ఎవరు ఇంట్లో ఉండాలో నిర్ణయిస్తాడని నాగ్‌ చెప్పాడు. ఇద్దరికీ చెరో బీకర్‌ ఇచ్చి అందులో నీళ్లు పోయాలని ఆ ఏడుగురికి చెప్పాడు. నలుగురు హారికకు ఓటేయడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. అయితే ఆఖరున డోర్‌ దగ్గర నాగార్జున ఆమెను ఆపేశాడు.

Click Here-> ఈ ప్రాసెస్‌ ఎలా జరిగిందంటే?

* హారిక ఎలిమినేట్‌ కాలేదు అని తెలిసేసరికి నోయల్‌, అభిజీత్‌ ఆమెను భుజాల మీద కూర్చోబెట్టి గేట్‌ దగ్గర నుంచి ఇంట్లోకి తీసుకొచ్చారు. సెల్ఫ్‌ నామినేషన్‌ చేసుకున్న అందరికీ హారికకు జరిగిన ఈ ఫేక్‌ నామినేషన్‌ ఓ వార్నింగ్‌ అని నాగార్జున చెప్పాడు. ఎవరికివాళ్లు నామినేషన్‌లోకి రాకూడదు అనేలా ఆడాలని సూచించాడు నాగ్‌.

* ఆఖరున మన షోకి మంచి టీఆర్పీ వచ్చిందని నాగ్‌ గర్వంగా చెప్పాడు నాగ్‌. దేశంలోనే అత్యధిక టీఆర్పీ మన షోకు వచ్చిందని నాగ్‌ చెప్పడంతో ఇంటి సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

‘బిగ్‌బాస్‌’ దివి గురించి మనకు తెలియని నిజాలు..!
తమకు ఇష్టమైన వాళ్ళకు కార్లను ప్రెజెంట్ చేసిన హీరోల లిస్ట్..!
ఇప్పటవరకూ ఎవ్వరూ చూడని బిగ్ బాస్ ‘అభిజీత్’ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus