ఈ వారం ఎలిమినేట్ అయిన కళ్యాణికి నాగార్జున ఓ టాస్క్ ఇచ్చాడు. బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ 5 అనిపించే ఐదుగురు, బోటమ్ 5 అనే ఐదుగురు పేర్లు, వివరాలను చెప్పమని అడిగాడు. ఈ క్రమంలో కళ్యాణి కొందరి విషయంలో మంచిగా చెప్పగా, ఇంకొందరి విషయాల్లో షాకింగ్ కామెంట్స్ చేసింది.
* సోహైల్‌ను బోట్ నెం 5గా కళ్యాణి ప్లేస్‌మెంట్ ఇచ్చింది. తను ఏదో చేద్దాం అనుకుంటాడు కానీ… చేయలేడు. ఏదైనా విషయంలో క్లియర్‌గా చెప్పాను అనుకుంటాడు కానీ అందులో క్లారిటీ ఉండదు. కప్పగంతులు వేస్తుంటాడు. గోడ మీద కూర్చొని ఎటు అవసరమైతే అటు గెంతేలా కనిపిస్తాడు.
* బోటమ్ 4గా సుజాతను ఎంచుకుంది. తను మంచిది అని చెప్పడానికి అవతలి వ్యక్తి మీద ఏదో ఒక మాట వేస్తేస్తుంది. అవసరముంటే ఎవరినైనా దగ్గరకు తీసుకుంటుంది. అవసరం లేనప్పుడు పక్కకు వెళ్లి… వీళ్లు నన్ను దూరం పెడుతున్నారు అని చెబుతుంది. ఆమె తెచ్చిపెట్టుకుని నవ్వకుండా… మనస్ఫూర్తిగా నవ్వు అని సూచించింది కళ్యాణి.
* ఆరియానాను బోటమ్3గా ఎంచుకుంది కళ్యాణి. ఆమె చాలా బాగా ఆడుతుంది. కానీ ఎక్కడో ఎవరి వల్లనో ఇన్ఫ్లూయెన్స్ అవుతోంది.
* బోటమ్ నెం 2గా కుమార్‌సాయి పేరు చెప్పింది. కుమార్ సాయి ఇంకా ఓపెన్ అప్ అవ్వాలని కళ్యాణి సూచించింది.
* బోటమ్ నెం 1 విషయంలో కళ్యాణి షాకింగ్ పేరు చెప్పింది. ఆమెనే గంగవ్వ. ఆమె చాలా తెలివైనది. అవే తెలివితేటలతో ఆడాలని సూచించింది కళ్యాణి. అయితే ఆరోగ్య రీత్య బోటమ్ నె.1 ఇచ్చింది.
* టాప్ లిస్ట్‌లో మొదటి ప్లేస్‌ను హారికకు ఇచ్చింది కళ్యాణి. చాలా స్ట్రాంగ్ పార్టిపిసెంట్. హార్టఫుల్‌గా ఉంటుంది. మనసులో అనిపించిన మాట స్ట్రయిట్‌గా చెప్పేస్తుంది.
* టాప్ లిస్ట్ లో రెండో ప్లేస్ అమ్మ రాజశేఖర్‌కు ఇచ్చింది. మీరు మీలా ఉండి ఆడండి అని మాస్టర్‌కు సూచించింది కళ్యాణి. అయితే ఇతరుల గేమ్‌ను ప్రభావితం చేయొద్దని సజెషన్ ఇచ్చింది.
* ఇక మూడో ప్లేస్‌లో మోనాల్‌ను ఉంచింది కళ్యాణి. ఎమోషన్స్ ఎక్కువ, జాగ్రత్త నీవెనుక చాలామంది కట్టప్పలు ఉన్నారు. తొందరగా తెలుగు నేర్చుకుంటే మంచిది. వాళ్లు ఏం అంటున్నారో నీకు అర్థమవుతుంది అని కళ్యాణి సూచించింది.
* నాలుగో ప్లేస్‌ను సాగర కన్య దివికి ఇచ్చింది. మంచి నటిగా పేరు తెచ్చుకోవాలి. నటిగా అవకాశాలు దక్కడానికి అవసరమైన ఫిజిక్ ఉంది.
* ఫైట్ ఇస్తే కచ్చితంగా గేమ్‌లో ఉంటాడు అంటూ అభిజీత్‌కి ఐదో స్థానం ఇచ్చింది. ఎందుకులే అంటూ కొన్ని విషయాల్లో కల్పించుకోవు. అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. అలాగే అతి విశ్వాసం మానేయడం మంచింది.
* ఈ లిస్ట్‌లో పెట్టని వాళ్ల గురించి కూడా కళ్యాణి చెప్పింది. నోయల్ తన గేమ్ తను ఆడుతూ.. ఓవర్ థింకింగ్‌తో తన గేమ్ తను పాడుచేసుకుంటున్నాడు. ఎవరినీ ఇన్‌ఫ్లూయెన్స్ చేయకుండా ఆడమని చెప్పింది.
* దేవీ నాగవల్లిని తక్కువ అంచనా వేయొద్దని కళ్యాణి సూచించింది. ఆమెతో పెట్టుకున్న వాళ్లు తమను తాము కోల్పోతారని కూడా చెప్పింది. అలాగే లాస్య చాలా అమాయకం. ఎవరేమనుకుంటారా అనుకొని ఇటా అటా అంటూ ఆలోచిస్తుంటుంది. అలా ఆమెకామె డిస్ట్రబ్ అయిపోతోంది.
* అవినాష్ అమాయక చక్రవర్తి. ఇంట్లో కన్ఫార్మ్‌గా బలైపోతాడు. కానీ జాగ్రత్తగా కొన్ని రోజులు ఉంటాడు. అందరూ ఆడుతున్న గేమ్‌ను తనవైపు తిప్పుకోగల సమర్థుడు మెహబూబ్. ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి.
* అఖిల్‌కు నాలాగే ఆవేశం ఎక్కువ. ఈ రోజు కాకపోయినా రేపటికైనా అది బయటికొచ్చేస్తుంది. అయితే ఇది ఈ గేమ్‌లో పనికిరాదు. అయితే కొంతమందికే సపోర్టు చేస్తున్నావనే అపవాదులు కూడా పడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
‘బిగ్‌బాస్’ దివి గురించి మనకు తెలియని నిజాలు..!
తమకు ఇష్టమైన వాళ్ళకు కార్లను ప్రెజెంట్ చేసిన హీరోల లిస్ట్..!
ఇప్పటవరకూ ఎవ్వరూ చూడని బిగ్ బాస్ ‘అభిజీత్’ ఫోటో గ్యాలరీ!