బిగ్‌బాస్‌ 4: ‘డాగ్‌ అండ్‌ ది బోన్‌’లో ఓడినవాళ్లే అలరించారు!

ఎలిమినేషన్‌ టెన్షన్‌ నుంచి బయటపడేయానికి, ఇంట్లో ఫన్‌ క్రియేట్‌ చేయడానికి డాగ్ అండ్‌ ది బోన్‌ గేమ్‌ను తీసుకొచ్చారు. మధ్యలో సర్కిల్‌ పెట్టి అందులో బోన్‌ పెట్టారు. పాట ప్లే చేసి.. అది ఆగిపోతే బోన్‌ తీసుకోవాలనేది ఆట. ఈ ఆటలో గెలిచినవారికి బోన్‌ దక్కితే. ఓడినవారికి టాస్క్‌ ఇచ్చారు. విన్నర్స్‌ ఎవరు? మరి ఓడిన వాళ్లు చేసిన టాస్క్‌ ఏంటంటే…

* అభిజీత్‌తో జరిగిన పోటీలో అఖిల్‌ గెలవగా, తర్వాత జరిగిన పోటీలో మోనాల్‌ చేతిలో హారిక ఓడిపోయింది. సోహైల్‌- మెహబూబ్‌ పోటీ మంచి రంజుగా సాగింది. ఇద్దరూ ఒకేసారి బోన్‌ పట్టుకొని కైవసం చేసుకొని పెద్ద కుస్తీయే చేశారు. ఆఖరికి మెహబూబ్‌ ఈ బోన్‌ యుద్ధంలో గెలిచాడు. దేవీ, అమ్మ రాజశేఖర్‌ మధ్య పోటీలో మాస్టర్‌ బోన్‌ను తీసుకున్నా… దేవీకి ఇచ్చేశాడు. ఈ ఆటో మరోసారి మజా వచ్చింది లాస్య, సుజాత వచ్చినప్పుడే. ఇద్దరూ బోన్‌ అందుకొని ‘పట్టర పట్టు హైలస్సా’ అంటూ ఫెవికాల్ యాడ్‌లాగా అటుఇటూ లాగారు. ఆఖరికి సుజాతనే గెలిచింది. దివి- అరియానా మధ్య జరిగిన పోటీలో బక్కపలచని ఆరియానా… మీద జలకన్య దివి గెలిచేసింది. గంగవ్వ, కుమార్‌ సాయి మధ్య జరిగిన ఆట.. ఈ ఆటకే హైలైట్‌. ఫుల్‌ జోష్‌లో గంగవ్వ స్టెప్పులేస్తూ… బోన్‌ కూడా ఎత్తేసింది. అంతేనా కుమార్‌ సాయిని భయపెట్టింది కూడా. ర్యాపర్‌ నోయల్‌, జోకర్‌ అవినాష్‌ మధ్య జరిగిన పోటీలో జోకర్‌ గెలిచాడు.

* ఈ ఆటలో ఓడిపోయిన అభిజీత్‌.. అఖిల్‌కు పోటీగా పుషప్స్‌ తీయమని టాస్క్‌ ఇవ్వగా, 20 దగ్గరే ఆగిపోయాడు. ఇక పెదాలు తాకకుండా మాట్లాడే టాస్క్‌ హారికకు ఇచ్చాడు. రౌడీబేబీ ఎప్పటిలాగే అదరగొట్టేసింది. ఇక సోహైల్‌కైతే పచ్చి ఉల్లిపాయ తినమని టాస్క్‌ ఇవ్వగా… సోహైల్‌ అయితే బాగా ఎంజాయ్‌ చేస్తూ తిన్నాడు. ఓడిపోయిన మాస్టర్‌ పచ్చి మిర్చిని పరపర నమిలేశాడు. మాస్టరా మజాకా అనిపించేశాడు. ఓడిపోయిన లాస్యను చిన్నపిల్లలా నటించమని టాస్క్‌ ఇచ్చాడు నాగ్‌. ఇందులో లాస్య అదరగొట్టేసింది. ఓడిపోయిన ఆరియానాకు పోల్‌ డ్యాన్స్‌ వేయమని టాస్క్‌ ఇచ్చారు. ఓడిపోయిన కుమార్‌ సాయికి భలే టాస్క్‌ ఇచ్చారు. నోట్లో నీళ్లు పోసుకొని పాట పాడమని చెప్పారు. దానికి కుమార్‌ సాయి నానా పాట్లు పడ్డాడు. ఓడిపోయిన నోయల్‌కు లిప్‌స్టిక్‌ పెట్టమని అవినాష్‌ చెప్పారు. మామూలుగా అయితే సులభమే కానీ. కళ్లు మూసుకొని పెట్టమనేసరికి ముఖమంతా పెట్టేశాడు అవినాష్‌.

‘బిగ్‌బాస్‌’ దివి గురించి మనకు తెలియని నిజాలు..!
తమకు ఇష్టమైన వాళ్ళకు కార్లను ప్రెజెంట్ చేసిన హీరోల లిస్ట్..!
ఇప్పటవరకూ ఎవ్వరూ చూడని బిగ్ బాస్ ‘అభిజీత్’ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus