బిగ్‌బాస్‌ 4: శత్రువులైన మిత్రులు: ఎవరిని ఎంతమంది నామినేట్‌ చేశారంటే?

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో మూడోవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్‌ ప్రక్రియ సీరియస్‌గా తీసుకోండి అని మొన్న నాగార్జున చెబితే, ఈ రోజు బిగ్‌బాస్‌ మరోసారి చెప్పాడు. దీనికోసం ‘మంటల్లో ఫొటోల ఆహుతి’ కాన్సెప్ట్‌ను కూడా తీసుకొచ్చాడు. అలా ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉన్న జాబితాలో మొత్తం 8 మంది చేరారు. అంటే నామినేట్‌ అయ్యారు. వారెవరు? నామినేషన్‌ ప్రక్రియ ఎలా జరిగిందంటే?

* కెప్టెన్‌గా నోయల్‌కు ప్రత్యేక అధికారం ఇచ్చారు. దాని ప్రకారం ఒకరిని నేరుగా నామినేట్‌ చేసే అవకాశం నోయల్‌కు దక్కింది. హౌస్‌ జర్నీలో తప్పులు జరిగినప్పుడు ఇతరులకు ఎఫెక్ట్‌ అవ్వకుండా నామినేట్‌ చేయాలి. దివికి ఏదైనా సమస్య వస్తే… ఆమె చెప్పుకోగలదు. కానీ లాస్య ఆ రోజు ‘పిల్లో’ టాపిక్‌ను తెచ్చి పరిస్థితిని ఇబ్బందుల్లో పడేసింది. అందుకే ఆమెను నామినేట్‌ చేస్తున్నాను. ఫ్యామిలీని, కెరీర్‌ని ఇబ్బంది పెట్టేలా ఎవరూ ఇక్కడ మాట్లాడకూడదు అని నోయల్‌ చెప్పాడు.

* మెహబూబ్‌ ఆరియానాను నామినేట్‌ చేశాడు. ఆరియానా ఉంటే లోలో ఉంటుంది. లేదంటే హైలో ఉంటోంది. తన రియాలిటీని దాచిపెడుతోందనిపిస్తుంది. ఇంకా ఓపెన్‌ అయ్యి… అందరితో ఫ్రీగా మూవ్‌ అయితే బాగుంటుంది అని మెహబూబ్‌ చెప్పాడు. హారిక గత మూడు రోజలుగా అందరితో కమ్యూనికేట్‌ కావడం లేదు. కొందరితోనే మాట్లాడుతూ ఉండిపోయింది.

* ‘మన ఇద్దరికీ క్లాష్‌ వచ్చింది కాబట్టి… అది ఇంకా కొనసాగుతుంది కాబట్టి మిమ్మల్ని నామినేట్‌ చేస్తున్నాను’ అంటూ అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ను దేవీ నాగవల్లి నామినేట్‌ చేసింది. ఇక రెండో వ్యక్తిగా కుమార్‌ సాయిగా ఎంచుకుంది. ఆయనలోని క్లారిటీ మిస్సింగ్‌, ఎక్స్‌ప్లైన్‌ చేసేటప్పుడు ఆయనలో కొంచెం కన్‌ఫ్యూజింగ్‌ కనిపిస్తోంది. అందుకే నామినేట్‌ చేస్తున్నాను.

* బిగ్‌బాస్‌లో అందరం ఉన్నామంటేనే అందరూ స్ట్రాంగ్‌ కాంపిటేటర్స్‌ అని అర్థం. దాంతోపాటు ఈ షో స్ట్రాంగ్‌ వర్సెస్‌ వీక్‌ కాంపిటేషన్‌ కాదు. బీకర్‌ టాస్క్‌ సమయంలో ‘నేను కాంపిటేషన్‌ కాదు’ అన్నాడు. ఇంకా మంచి రీజన్‌ చెప్పి ఉంటే బాగుండేది. అలాగే గత మూడు రోజులుగా నేను ఎవరినీ కలవలేదు అని అన్నాడు. నాకు తెలిసి అతనూ కలవలేదు అంటూ హారిక వివరణ ఇచ్చింది. తెలుగులో మాట్లాడలేదు కాబట్టి నన్ను ఎలిమినేట్‌ చేద్దామని సుజాత ట్రై చేసింది. అయితే గత వారంలో నాకు బిగ్‌బాస్‌ నుంచి అలాంటి సూచన రాలేదు. అంతకుముందు వచ్చింది. కాబట్టి సుజాత కారణమే తప్పు. కాబట్టి ఆమె కూడా బెటర్‌ రీజన్‌ ఇవ్వాల్సింది.

* అందరితో కలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మెహబూబ్‌, హారికను అవినాష్‌ నామినేట్‌ చేశాడు. ప్రస్తుతం ఇంట్లో భోజనం సమయంలో మాత్రమే కలసి ఉంటున్నాం… తర్వాత ఎవరికివారే అన్నట్లుగా కొంతమందితో కలసి ఉంటున్నారు అని అవినాష్‌ కామెంట్‌ చేశాడు.

* ఒకే విషయాన్ని నాలుగు రకాలుగా అబద్దం చెప్పిందంటూ మోనాల్‌ను నిన్న దివి విమర్శించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే రీజన్‌తో నామినేట్‌ చేసింది. ఇంకా ఈక్వేషన్‌ డెవలప్‌ అవ్వలేదనే కారణం చెప్పి కుమార్‌ సాయిని రెండో పర్సన్‌గా నామినేట్‌ చేసింది దివి.

* సరైన రిలేషన్‌ షిప్‌ బిల్డ్‌ అవ్వలేదని చెబుతూ ఆరియానాను అభిజీత్‌ నామినేట్‌ చేశాడు. ఈ వారం మొత్తం చూసినా నీ నుంచి సరైన రెస్పాన్స్‌ లేదని కూడా కారణం చెప్పాడు. ఇక రెండో వ్యక్తిగా సుజాత పేరు చెప్పాడు. తనతో కమ్యూనికేషన్‌ సరిగ్గా మెయింటైన్‌ చేయడం లేదని సుజాతకు వివరించాడు అభిజీత్‌. ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా క్లియర్‌ చేసుకోకుండా… వేరొకరి దగ్గర చర్చించడం సరికాదని కూడా చెప్పాడు.

* ‘నీలో కాస్త ఇన్‌ సెక్యూరిటీ ఉంది’ అంటూ మెహబూబ్‌ను నామినేట్‌ చేశాడు కుమార్‌ సాయి. హార్ట్‌ పెట్టిన కూడా గెలవొచ్చు, అన్నింటికీ ప్లానింగ్‌ అవసరం లేదని కూడా చెప్పాడు. చెప్పుల విషయంలో జరిగిన చిన్నపాటి డిస్కషన్‌ వల్ల అఖిల్‌ను నామినేట్‌ చేస్తున్నట్లు కుమార్‌ సాయి చెప్పాడు. అలాగే పడవ టాస్క్‌లో ‘నేనేదో నా అనారోగ్యాన్ని కవర్‌ చేయడానికి హౌస్‌మేట్స్‌ మీద నెట్టి దిగిపోయాను’ అని నువ్వు చెప్పడం నాకు నచ్చలేదు అని అఖిల్‌ నామినేషన్‌కు మరో కారణంగా కుమార్‌ సాయి చెప్పాడు.

 

* పడవ టాస్క్‌ విషయంలో జరిగిన చర్చ, ఆ తర్వాత అంశాలను ప్రస్తావిస్తూ కుమార్‌ సాయిని గంగవ్వ నామినేట్‌ చేసింది. రెండో నామినేషన్‌గా మోనాల్‌ను ఎంచుకుంది గంగవ్వ. ఇంట్లో విషయాలు, తెలుగు మాటలు సరిగ్గా అర్థం కావడం లేదు అనే కారణంతో మోనాల్‌ను నామినేట్‌ చేశానని గంగవ్వ చెప్పింది.

 

* అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ ఆరియానా, కుమార్‌ సాయిని నామినేట్‌ చేశారు. ఆరియానా విషయంలో జీరోనా హీరోనా టాస్క్‌లో తనను సపోర్టు చేయలేదని కారణంగా చెప్పాడు మాస్టర్‌. ఇంకా బాగా క్లోజ్‌ అవ్వాలని కోరుతూ కుమార్‌ సాయిని నామినేట్‌ చేశాడు మాస్టర్‌.

 

* ఆరియానా, దివి ఫొటోలను మోనాల్ మంట్లో వేసింది. తనతో కనెక్ట్‌ అవ్వడానికి ట్రై చేస్తున్నా ఆరియానా ముందుకు రావడం లేదని ఆరియానా గురించి చెప్పింది మోనాల్‌. ఇక దివి సంగతి కొచ్చేసరికి ఆ ‘నాలుగు అబద్దాల’ విషయాన్ని చెప్పింది మోనాల్‌. నా మీద నీకు నమ్మకం ఉందా? లేదా అనేది నాకు అనవసరం అంటూనే ‘నేను అబద్దాలు చెప్పలేదు’ అనే స్టేట్‌మెంట్ ఇచ్చింది మోనాల్‌.

* ఏదైనా పని చేసినప్పుడు ప్రేమగా చేయాలి.. కానీ చెప్పులు సర్దే విషయంలో కుమార్‌ విసురుగా పడేశాడు. అందుకే అతనిని నామినేట్‌ చేస్తున్నా అని అఖిల్‌ చెప్పాడు. అయితే ఈ విషయంలో కుమార్‌ సాయి తన స్పందన కూడా చెప్పాడు. నేను విసరుగా పడేశానా లేదా అనేది మీరు చూడలేదు… ఎందుకలా నా మీద అపవాదు వేస్తున్నారు అని అడిగాడు. పడవ టాస్క్‌లో ‘నీకు షివరింగ్‌ రావడం నేను చూశా. కానీ నువ్వు దానిని ఒప్పుకోకుండా. మా మీద అభాండాలు వేస్తున్నావ్‌’ అంటూ ఆ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చి నామినేట్‌ చేశాడు అఖిల్‌. ఇక రెండో నామినేషన్‌గా ఆరియానాను ఎంచుకున్నాడు అఖిల్‌. నామినేట్‌ అవుతానని భయపడుతున్నావ్‌.. అసలు నామినేట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంటుందో కూడా తెలియాలనే ఆమెను నామినేట్‌ చేశా అని చెప్పాడు అఖిల్‌.

* జెన్యూన్‌ ప్లేయరే కానీ… ఒక్కోసారి చిన్న విషయాలకే ఆటిట్యూడ్‌ చూపిస్తున్నావ్ అంటూ ఆరియానాను సోహైల్‌ నామినేట్‌ చేశాడు. నేనెప్పుడు, ఏం చేయాలో నాకు తెలుసు.. అలా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో కొంతమందిని ఇరిటేట్‌ చేస్తున్నావ్‌ అంటూ వివరించాడు సోహైల్‌. ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఇక రెండో నామినేషన్‌గా కుమార్‌సాయిని ఎంచుకున్నాడు సోహైల్‌. ‘షూస్‌’ సర్దే విషయంలో కుమార్‌సాయి తత్వాన్ని సోహైల్‌ ప్రశ్నించాడు.

* లాస్య కూడా కుమార్‌ సాయినే నామినేట్‌ చేస్తున్నాను. తొలుత ఆయన సెల్ఫ్‌ నామినేట్‌ అవ్వడం, పడవ దిగాక ఇంటి సభ్యులందరూ నన్ను దిగమన్నారు కాబట్టే నేను దిగాను అని కుమార్‌ సాయి చెప్పడం కూడా నాకు నచ్చలేదు. నా ప్రపంచం నాది అన్నట్లుగా ఉంటున్నాడు. అందరితో కలవడానికి ట్రై చేయ్‌ అని లాస్య సూచించింది. రెండో నామినేషన్‌గా ఆరియానాను ఎంచుకుంది లాస్య. జెన్యూన్‌గా ఆడటానికి ట్రై చేస్తున్నా… ఎక్కడో అటెన్షన్‌ గ్రాబ్‌ కోరిక కనిపిస్తోంది. అది అవసరం లేదనిపించి ఆరియానాను నామినేట్‌ చేస్తున్నా అని లాస్య చెప్పింది.

* తనను తొందరగా జడ్జ్‌ చేసిందని చెబుతూ మోనాల్‌ను నామినేట్‌ చేసింది ఆరియానా. ఆ తర్వాత మెహబూబ్‌ను నామినేట్‌ చేసింది ఆరియానా. ఎక్కువ వర్క్‌ చేసి శభాష్‌ అనిపించుకోవడానికి మెహబూబ్‌ ప్రయత్నిస్తున్నాడనిపిస్తోంది. ఇది ఫేక్‌గా కనిపిస్తోందని ఆరియానా చెప్పింది.

* సుజాత టర్న్‌ వచ్చేసరికి తొలుత హారికను నామినేట్‌ చేసింది. బీకర్‌ టాస్క్‌లో హారికను నామినేట్‌ చేయడం వెనుక కారణాన్ని వివరించింది సుజాత. తెలుగులో మాట్లాడలేదంటూ ఒకటి రెండు సిచ్యువేషన్లు చెప్పింది. వాటిని హారిక యాక్సెప్ట్‌ చేసింది. రెండో నామినేషన్‌ పేరుగా అభిజీత్‌ను చెప్పింది సుజాత. తన ఉన్న ప్రాబ్లమ్‌ను క్లియర్‌ చేసుకోవడానికి ట్రై చేసినా వీలుపడలేదు.. కానీ నేనే మాట్లాడటానికి ప్రయత్నించలేదు అని అభిజీత్‌ అనడం సరికాదని చెప్పింది సుజాత.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus