Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ‘కట్టప్ప’ అఖిల్‌… ‘ఫైర్‌’ సోహైల్‌… ‘కోపాల’ కళ్యాణి

బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ‘కట్టప్ప’ అఖిల్‌… ‘ఫైర్‌’ సోహైల్‌… ‘కోపాల’ కళ్యాణి

  • September 9, 2020 / 09:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ‘కట్టప్ప’ అఖిల్‌… ‘ఫైర్‌’ సోహైల్‌… ‘కోపాల’ కళ్యాణి

‘బిగ్‌బాస్‌’ హౌస్‌లో రెండో రోజు భలే మజాగా సాగింది. ‘ఐ వనా ఫాలో… ’ అంటూ మొదలైన రోజు.. తో ముగిసింది. కళ్యాణి టీచర్‌ గెటప్‌, కట్టప్ప ఓటింగ్‌, లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌, నైబర్‌ హౌస్‌ ఖాళీ చేయడం… లాంటివి జరిగాయి. ఇంకా రెండో రోజు (08/09/20)న ఏం జరిగిందంటే?

* పార్టిసిపెంట్స్‌ను జోష్‌తో డేను ప్రారంభించడానికి ఈ రోజు బిగ్‌బాస్‌ ఎన్టీఆర్‌ పాటను వేయించాడు. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలోని ‘ఐ వనా ఫాలో ఫాలో..’ పాట ప్లే చేయించాడు. పాటకు ఎప్పటిలాగే అందరూ స్టెప్పులేయగా… గంగవ్వ మరోసారి హైలైట్‌ అయ్యింది. చిన్నగా ఊగుతూ అవ్వ వేసిన స్టెప్పులకు భలే రెస్పాన్స్‌ వచ్చింది.

* తొలి రోజు ఆఖరున బిగ్‌ బాస్‌ చెప్పిన ‘కట్టప్ప’ గుర్తున్నాడా? రెండో రోజు పాట పూర్తవుతుండగానే ఇంటి ముందు కట్టప్ప వెన్నుపోటు మార్కు ఇమేజ్‌ ఇంటి ముందు వేలాడుతున్నట్లు చూపించారు. ఆ తర్వాత చూస్తే గార్డెన్‌ ఏరియాలో ఆ ఫొటోలు చాలా కనిపిసించాయి. ‘ఎవరు’, ‘అపాయం’, ‘తస్మాత్‌ జాగ్రత్త’ అంటూ ఫొటోల కింద రాశారు.

* హౌస్‌లో అప్పుడే మొదలైన చిన్న చిన్న గొడవల గురించి గంగవ్వ చిన్నసైజు క్లాసు తీసుకుంది. ఇక్కడ ఎవరు ఎన్ని రోజులుంటారు ఎవరికి తెలుసు. అలాంటప్పుడు ఈ గొడవలెందుకు. రెండు వారాలుంటామో, మూడు వారాలుంటేమో, ఒక వారముంటామో అంటూ వేదాంతం వల్లించింది.

* మార్నింగ్‌ మస్తీలో స్కూల్‌ కాన్సెప్ట్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. హౌస్‌ నియమాలను వివరించేలా క్లాస్‌ ఏర్పాటు చేయించాడు. కరాటే కళ్యాణి టీచర్‌గా ఇంటి నియమాలు చెప్పే ప్రయత్నం చేసింది. ఈ లోగా అమ్మ రాజశేఖర్‌.. కళ్యాణికి ఐ లవ్‌ యూ చెప్పాడు. అమ్మో అనుకుంటుండగా… ఈ మాట తెలుగులోనే చెప్పండి అంటూ ఇంటి నియమం చెప్పి నవ్వులు పూయించింది కళ్యాణి.

* ఆ ఝలక్‌ నుండి కళ్యాణి బయటపడిందో లేదో.. గంగవ్వ షురూ చేసింది. ‘ఏంటి అవ్వ నువ్వు 50 సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నావ్‌’ అని కళ్యాణి అనగానే… ‘జీతం తీసుకొని నన్ను ఫెయిల్‌ చేస్తున్నావ్‌’ అంటూ పంచ్‌ వేసింది గంగవ్వ. ‘డబ్బులు తీసుకొని నన్ను పాస్‌ చేయకుండా ఇంటికెళ్లి వంట చేసి పడుకుంటున్నావ్‌’ అంటూ పంచ్‌కు కాస్త మసాలా యాడ్‌ చేసింది గంగవ్వ.

* ‘కట్టప్ప ఎవరు’ అనే చర్చ జరుగుతూనే ఉంది. సూర్యకిరణే కట్టప్ప అని లాస్య, కళ్యాణి ఓ నిర్ణయానికి కూడా వచ్చారు. అయితే మిగిలిన వారి మసులో వేరే పేర్లు ఉన్నాయి.

* ర్యాప్‌ అంటే నోయల్‌ అనుకుంటాం కానీ… సూర్యకిరణ్‌ కూడా ర్యాప్‌తో అదరగొట్టారు. పెడారాప్‌ స్టైల్‌లో సూర్యకిరణ్‌ పాట అందుకోగా… అందరూ గొంతు కలిపారు. పాట అయితే సూపరో సూపర్‌.

* నైబర్‌ హౌస్‌ కాల్‌ రూపంలో బిగ్‌బాస్‌ ఏదో ఫన్‌ క్రియేట్‌ చేద్దాం అనుకుంటే అది ఇంకేదో అయ్యింది. ఆరియానా, అఖిల్‌ కాన్వర్జేషన్‌ ఫన్‌ తీసుకురాకపోగా, తికమక.. చిరాకు పుట్టించింది. ఆరియానా ఏదో అడిగి, అఖిల్‌ ఇంకేదో చెప్పి చప్పగా సాగింది. అయితే ఆఖరులో నోయల్‌ ఫోన్‌ అందుకొని ఫన్‌ స్టార్ట్‌ చేశాడు. ‘ఏదో పొరుగింటి వాళ్లు కదా అని మీకు ఫుడ్‌ పంపిస్తే ఇలా మాట్లాడతారా.. అంతగా కావాలంటే మా ఇంటికొచ్చి తినండి’ అని అన్నాడు. ఇక ప్రోమోలో వచ్చిన ‘నీ పేరేంటి’ పంచ్‌ ఇక్కడ వచ్చింది. నోయల్‌ను ఆరియానా పేరు అడగగా… ‘గూగుల్‌ చేసుకో’ అంటూ ఝలక్‌ ఇచ్చాడు.

* ‘మీలో ఎవరు కట్టప్ప’ అనే విషయంలో బిగ్‌బాస్‌ ఓటింగ్‌ ఏర్పాటు చేశాడు. మెహబూబ్‌ అని నోయల్‌ చెప్పగా, నోయల్‌ అని దేవి నాగవల్లి ఓటేసింది. ఇక కట్టప్ప అంటే వెన్నుపోటే కాదు ప్రేమ అంటూ సూర్యకిరణ్‌ పేరును హరిక రాసింది. లాస్య పేరును దివి రాయగా, సూర్యకిరణ్‌ పేరును లాస్య రాసుకొచ్చింది. అఖిల్‌ కూడా నోయల్‌నే కట్టప్ప అని అనుకున్నాడు. అమ్మ రాజశేఖర్‌ పేరును అభిజిత్‌ రాశాడు. దీనిని నోయల్‌ పసిగట్టినట్లు కనిపించింది కూడా. మోనాల్‌ కూడా అమ్మ రాజశేఖర్‌ పేరే రాసింది. దివి స్టయిల్‌లోనే మెహబూబ్‌ కూడా లాస్య పేరు రాసుకొచ్చాడు. కళ్యాణి, అమ్మ రాజేఖర్‌, సుజాత, సూర్యకిరణ్‌ అయితే అఖిల్‌ ను కట్టప్ప అనుకున్నారు. ఆఖరికి గంగవ్వ కూడా అఖిల్‌ పేరునే రాయమని చెప్పింది.

* కరాటే కళ్యాణి – అభిజిత్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. నోయల్‌, గంగవ్వ, కళ్యాణి, మోనాల్‌, అభిజిత్‌ కలసి కూర్చొని ఏదో మాట్లాడుతుండగా అభిజిత్‌.. కళ్యాణి మీద ఏదో జోక్‌ వేశాడు. దానికి ఆమె ‘నేను మరీ అంత భయంకరంగా ఉండను కదా.. నాకంటూ కొంచెం ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది’ అంటూ లేచి వెళ్లబోయింది. నేను ఇక్కడ ఉండటం మీకు ఇష్టం లేదనుకుంటా అంటూ మాటల జోరు పెంచింది. అభిజిత్‌ కూల్‌గా సమాధానమిస్తున్నా.. ఆమె మాత్రం కసురుకున్నట్లే మాట్లాడింది. అభిజిత్‌ ఎంత సారీ చెప్పినా… కళ్యాణి వినలేదు. ఆ తర్వాత కళ్యాణి దగ్గరకు వెళ్లి అభిజిత్‌ ఎంత సముదాయించే ప్రయత్నం చేసినా ఆమె వినిపించుకోలేదు.

* మోనాల్‌ మరోసారి కులాయి ఆన్‌ చేసేసింది. నాన్‌వెజ్‌ వండే విషయంలో మొదలైన చర్చ… తర్వాత అలా అలా ఎటో వెళ్లిపోయింది. నీకు ఇబ్బంది లేకుండా నాన్‌వెజ్‌ మేం వండుకుని తింటాం, నీకు వెజ్‌ వండుతాం అని చెబితే మోనాల్‌ కాస్త కుదురుకుంది. ఆ తర్వాత ఆమె ఏడుపు అలా సాగుతూనే ఉంది.

* ఈ సీజన్‌ కన్ఫెషన్‌ రూమ్‌ను ఈ రోజు చూపించారు. గత సీజన్ల తరహాలోనే చిన్న రూమ్‌లో కన్ఫెషన్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. చెస్‌ స్టైల్‌లో కన్ఫెషన్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సీజన్‌లో తొలిసారిగా ఈ రూమ్‌కి వెళ్లింది లాస్య.

* ఈ సీజన్‌లో తొలి బడ్జెట్‌ టాస్క్‌ ఈ రోజే జరిగింది. దేవి నాగవల్లి సంచాలకురాలిగా వ్యవహరించింది. ఫైండర్‌గా అమ్మ రాజశేఖర్‌ను ఏర్పాటు చేశారు. సభ్యులు ఆరు టీమ్‌లుగా విడిపోయి పెయింటింగ్‌ వేసే టాస్క్‌ ఇచ్చారు. టీమ్‌లో ఒకరు తమ చేతికిచ్చిన పెయింటింగ్‌ను మాటల్లో వివరిస్తే… మరొకరు పెయింటింగ్‌ వేయాలి. ఆ తర్వాత ఫైండర్‌ అమ్మ రాజశేఖర్‌ ఎవరు ఏ పెయింట్‌ వేశారో గుర్తించాలి. ఇదీ టాస్క్‌. ఇందులో 14 వేల పాయింట్లకుగాను 5 వేల పాయింట్లు మాత్రమే సంపాదించారు. అయితే ఇది తొలి అంకం మాత్రమే. రెండో అంకంలో ఏం జరుగుతుందో మూడో రోజు తెలుస్తుంది.

* నైబర్‌ హోమ్‌లో ఉన్న ఆరియానా, సోహైల్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చేశారు. ‘మిమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు.. ఫుడ్‌ కూడా పెట్టలేదు కాబట్టి మీరే వెళ్లి తేల్చుకోండి’ అని బిగ్‌బాస్‌ తేల్చేశాడు. దీంతో రాత్రి 12 తర్వాత ఈ ఇద్దరు ఇంట్లోకి ప్రవేశించారు. ‘మాకు ఫుడ్‌ పెట్టకపోవడానికి కారణమేంటి’ అంటూ మొదలైన గొడవ… అలా పెరిగి పెరిగి పెద్దదైంది. సోహైల్‌, అభిజిత్‌ ‘అరవడాలు’ వరకు వెళ్లాయి. గొడవ చూస్తే పెద్దదయ్యేలా కనిపిస్తోంది. మరి ఇది ప్రోమో గొడవనా, లేక నిజం గొడవనా అనేది మూడో రోజు చూద్దాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 4 Telugu
  • #nagarjuna
  • #Nagarjuna Akkineni

Also Read

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

related news

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

trending news

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

1 hour ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

2 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

3 hours ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

20 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 day ago

latest news

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

6 mins ago
Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

14 mins ago
Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

1 day ago
Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version