బిగ్ బాస్ హౌస్ లో 10వారాలు ఉండటం అనేది అంత మామూలు విషయం కాదు. అందులోనూ ఒకవైపు హౌస్ మేట్స్ అందరినీ మెప్పిస్తూ, మరోవైపు ఆడియన్స్ హృదయాలని గెలుచుకోవాలి. ఇది కత్తిమీద సాములాంటింది. ఇప్పటివరకూ మనం హౌస్ మేట్స్ ని చూసినట్లయితే, అందరూ కూడా టాప్ – 5 లోకి దూసుకుపోవడానికి రెడీగానే ఉన్నారు. ప్రస్తుతం హారిక కూడా తన ఓటింగ్ ని వారం వారంకి పెంచుకుంటూ పోతోంది. ముఖ్యంగా పల్లెకిపోదాం టాస్క్ లో మల్లి క్యారెక్టర్ లో చేసిన సీక్రెట్ టాస్క్ హారికకి మంచి ప్లస్ పాయింట్ అయ్యింది. అంతేకాదు, అమ్మరాజశేఖ్ మాస్టర్- అరియానా ఆడిన రింగ్ గేమ్ కూడా హారికకే ఎక్కువ ప్లస్ అయ్యింది.
అందుకే, ఇప్పుడు టాప్ – 5 లోకి హారిక వెళ్తుందనే చెప్తున్నారు బిగ్ బాస్ లవర్స్ అందరూ. ప్రస్తుతం మెహబూబ్ 10వ వారం ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి తర్వాత వారాల్లో హారికకి గేమ్ పరంగా తిరుగుండదని చెప్తున్నారు. డ్యాన్స్ లో కానీ, అలాగే గేమ్ ఆడేటపుడు దూసుకుపోయేతత్వం కానీ హారికకి ప్లాస్ పాయింట్. సో ఇప్పుడు మెహబూబ్ వెళ్లిపోయాక హారిక గ్రాఫ్ పెరుగుంతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో కూడా గేమ్ లో నెక్ట్స్ హారిక చెలరేగిపోతుదని తన గేమ్ ని పూర్తిగా మార్చేసి టాప్ – 5 కి దూసుకుపోతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదీ మేటర్.