బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు టాప్ – 5కి ఎవరు చేరుకుంటారు అనేది సోషల్ మీడియాలో చాలా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అభిజిత్, హారిక – అఖిల్ – మోనాల్, సోహైల్ , అవినాష్ – హారిక ఇలా ప్రస్తుతం మూడు పెయిర్స్ గా ఉన్న బిగ్ బాస్ హౌస్ లో సోలోగా సోహైల్ గేమ్ ఆడుతున్నాడు. అంతేకాదు, హౌస్ మేట్స్ కుటుంబసభ్యులు వచ్చినపుడు అందరూ కూడా సోహైల్ గేమ్ ని మెచ్చుకున్నారు. సోహైల్ టాప్ 5 కి వెళ్తాడని జోస్యం కూడా చెప్పారు. కాబట్టి సోహైల్ ప్లేస్ కి ఢోకా లేదనిపిస్తోంది.
అలాగే, ఓటింగ్ లో చూసినట్లయితే వరుసగా నామినేషన్స్ లోకి వచ్చినా కూాడ హారికకి అలాగే అభిజిత్ కి కూడా ఢోకా లేదనిపిస్తోంది. సో ఈ ముగ్గురు ఖచ్చితంగా టాప్ – 5 లో ఉంటారు. అలాగే, అఖిల్ కూడా లాస్ట్ వీక్ మంచి ఓటింగ్ ని చూపించాడు కాబట్టి ఖచ్చితంగా ఫినాలే రేస్ లో ఉంటాడనే అంటున్నారు. సో, అఖిల్, అబిజిత్, హారిక, సోహైల్ ఈ నలుగురు కన్ఫార్మ్ గానే ఫినాలే రేస్ లో తలబడతారు.
మరి ఆవచ్చే ఒక్కరు ఎవరు అనేది ఇప్పుడు ఇంట్రస్టింగ్. ఈవారం గనుక ‘రేస్ టు ఫినాలే’ టాస్క్ ఏదైనా పెడితే, అందులో అరియానా కానీ, లేదా మోనాల్ కానీ, లేదా అవినాష్ కానీ ఫినాలే టిక్కెట్ ని సంపాదిస్తే డైరెక్ట్ గా టాప్ 5 లోకి వెళ్లిపోతారు. అప్పుడు అఖిల్, హారిక, అభిజిత్, సోహైల్ ఈ నలుగురులో ఒకరికి డేంజర్ ఉంటుంది. అవినాష్ లేదా అరియానా ఫినాలే టిక్కెట్ సంపాదిస్తే, మిగిలేది మోనాల్. అలాగే అఖిల్, హారిక , అభిజిత్ , ఇంకా సోహైల్ లలో ఎవరైనా సరే ఎలిమినేట్ అయిపోవచ్చు.
అవినాష్ ఫినాలేకి వెళ్లిపోయి, అరియానా మోనాల్ సేఫ్ జోన్ లో నామినేట్ అవ్వకుండా ఉంటే.., అఖిల్, హారిక, అభిజిత్ , సోహైల్ లు నామినేషన్స్ లోకి వస్తే.., అప్పుడు కథ వేరేలా ఉంటుంది. అందుకే, 13వ వారం, 14వ వారం ఈ నలుగురు నామినేషన్స్ లోకి రాకుండా జాగ్రత్త పడాలి. మరి ఈ రేస్ టు ఫినాలే ఎవరి వస్తుంది..? ఎవరు అందరికంటే ముందు ఫినాలే బెర్త్ ని కైవసం చేసుకుంటారు అనేది చూడాలి.