బిగ్‌బాస్‌ కొత్త సీజన్‌కు సర్వం సిద్ధం చేస్తున్నారట

ఒక బిగ్‌బాస్‌ సీజన్‌ అయిపోతుండగానే మరో సీజన్‌ గురించి అనౌన్స్‌ చేయడం బిగ్‌బాస్‌ 5తో స్టార్ట్‌ చేసింది టీమ్‌. మరిప్పుడు 17 రోజుల్లో ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ అయిపోతోబోతోంది. కాబట్టి ఆ రోజున ‘బిగ్‌బాస్‌ 6’ గురించి అనౌన్స్‌ చేస్తారా? ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఈ విషయం గురించే చర్చ నడుస్తోంది. గత సీజన్‌లో ప్రారంభించిన సాంప్రదాయాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తారని చెబుతున్నారు టీమ్‌. ఒకవేళ అదే జరిగితే ఫ్యాన్స్‌కి పండగే అనొచ్చు.

ఐదు సీజన్లుగా అదరగొట్టిన బిగ్‌బాస్‌ తెలుగుకి సంబంధించి ఆరో సీజన్‌ అనౌన్స్‌మెంట్‌ బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ఫైనల్‌ వేదిక మీదే ఉంటుంది అని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా సాగితే ఆ రోజు కొత్త బిగ్‌ బాస్‌ సీజన్‌ లోగో కూడా ఆవిష్కరిస్తారని సమాచారం. అయితే వెంటనే షో మొదలవుతుందని చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు సెట్‌ ఉన్న ప్లేస్‌లోనే కొత్త సెట్‌ వేయాలి. కంటెస్టెంట్ల ఎంపిక జరగాలి. అన్నింటికి మించి ప్రేక్షకులకు చిన్న గ్యాప్‌ ఇవ్వాలి.

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ మరో 17 రోజుల్లో ముగియబోతోంది. ఇప్పటికే పాత బిగ్‌బాస్‌ మేట్స్‌ హౌస్‌లోకి వచ్చి సందడి చేస్తున్నారు. ఫైనల్‌కి ఐదుగురిని ఎంపిక చేసే ప్రక్రియ నడుస్తోంది. పారలల్‌గా బిగ్‌బాస్‌ 6 పనులు కూడా మొదలుపెట్టారట. అందుకే నాన్‌స్టాప్‌ ఫైనల్‌లో ‘బిగ్‌బాస్‌ 6’ అనౌన్స్‌మెంట్‌ ఉంటుందని కచ్చితంగా లీక్‌లు వసతున్నాయి. ఈసారి బిగ్ బాస్‌లో సెలబ్రిటీలతో పాటు కామన్ పీపుల్‌కి కూడా అవకాశం ఇస్తారని తెలుస్తోంది.

గతంలో అంటే సీజన్ 2లో నూతన్ నాయుడు, సంజనా అన్నే, గణేష్ లాంటి కామన్ పీపుల్‌ వచ్చారు, అలరించారు కూడా. మరి ఈ సీజన్‌లో ఎవరు రాబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. ఈ సీజ‌న్‌కు సుమన్ టీవీ యాంకర్లు మంజూష, రోషన్ తదితరులు ఫిక్స్ అయినట్టు సమాచారం. వీరితోపాటు ఫేమ‌స్ యూట్యూబ్ యాంకర్ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో ఎవరెవరు ఫైనల్‌ అవుతారు అనేది చూడాలి. చూద్దాం నాన్‌స్టాప్‌ ఫైనల్‌ నాడు క్లారిటీ వస్తుంది.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus