Damini: అలా అయితేనే పెళ్లి చేసుకుంటా : ‘బిగ్ బాస్’ దామిని

  • October 1, 2023 / 03:06 PM IST

‘బిగ్ బాస్ 7’ లో మూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది సింగర్ దామిని. విచిత్రం ఏంటంటే ఈమె ఎలిమినేట్ అయ్యింది కూడా మూడో కంటెస్టెంట్గానే..! హౌస్ లో ఈమె కూల్ గానే ఉంటూ వచ్చింది. అందరికీ బాగా వంట చేసి పెట్టేది. ఈమె బెస్ట్ కుక్ అని తోటి హౌస్మేట్స్ అంతా పొగిడేవారు.హోస్ట్ నాగార్జున కూడా ఈమెను వంటలక్క అంటూ ఆటపట్టించిన సంగతి తెలిసిందే. అయితే హౌస్మేట్స్ ఈమె వంట తిని పొగిడినప్పటికీ.. నామినేట్ చేయకుండా వదల్లేదు.

ప్రేక్షకులకి హౌస్ లో వంట బాగా చేసేవాళ్ళతో పనేముంటుంది చెప్పండి. అందుకే ఈమెను మూడో వారం ఎలిమినేట్ అయ్యేలా చేసేశారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. హౌస్ నుండి బయటకు వచ్చాక, దామిని వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. ఈ క్రమంలో ఆమె తన పెళ్లి గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను వెజిటేరియన్.. కాకపోతే గుడ్డు మాత్రం తింటాను.

‘బాహుబలి’ లో పచ్చబొట్టేసినా.. అని పాట పాడాను..! కానీ ఇంతవరకు నా ఒంటిపై ఒక్క పచ్చబొట్టు కూడా వేయించుకోలేదు. నాకిష్టమైన ప్రదేశానికి వెళ్లి టాటూ వేయించుకోవాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. ఏదైనా స్పెషల్ మూమెంట్ వచ్చినప్పుడే ఆ పని చేయాలని భావిస్తున్నాను. నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం. కొన్నాళ్లు సహజీవనం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుందని నా అభిప్రాయం.

ఈరోజుల్లో సహజీవనం చేస్తే తప్పేం కాదు. అలాంటి పరిస్థితి వస్తే ఇంట్లో వాళ్ల అనుమతి తీసుకున్నాకే లీవ్ ఇన్ రిలేషన్ లో ఉండాలని భావిస్తున్నాను. అమ్మానాన్న నన్ను అర్థం చేసుకుంటారు అనే నమ్మకం నాకు ఉంది. అందుకే నాకింకా పెళ్లి కాలేదు’ అంటూ చెప్పుకొచ్చింది దామిని.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus