బిగ్ బాస్ హౌస్ లో గ్రాండ్ ఫినాలే కోసం టాప్ లోకి వెళ్లేందుకు హౌస్ మేట్స్ పోటీ పడుతున్నారు. ఇందులో పవర్ అస్త్రా దక్కించుకునేందుకు ముగ్గురు రేస్ లో ఉన్నారు. నిజానికి గౌతమ్ అందరి అంచనాలని తల్లక్రిందులు చేస్తూ ప్రియాంక మాట కాదనలేక అర్జున్ ని కాదని అమర్ కి పాయింట్స్ ని ఇచ్చాడు. దీంతో అర్జున్ లీస్ట్ లోకి వెళ్లిపోయాడు. ఇక బిగ్ బాస్ 10వ టాస్క్, 11వ టాస్క్ పెట్టాడు. ఈ రెండు టాస్క్ లలో కూడా అర్జున్ విజయం సాధించి పల్లవి ప్రశాంత్ ని రేస్ లో లేకుండా చేశాడు.
దీంతో పల్లవి ప్రశాంత్ తప్పుకోవాల్సి వచ్చింది. ఫైనల్ గా టేబుల్ లో టాప్ లో ఉన్న అర్జున్ ఇంకా అమర్ ఇద్దరూ కూడా ఫినాలే టిక్కెట్ కోసం టాస్క్ ఆడారు. గౌతమ్ పాయింట్స్ ఇవ్వకపోయినా సరే అర్జున్ ఎలాంటి నిరుత్సాహం చెందకుండా టాస్క్ లో పెర్ఫామ్ చేశాడు. రెండు టాస్క్ లలోనే కాకుండా అమర్ తో పోటీపడి ఫైనల్ టాస్క్ లో కూడా గెలిచి ఫినాలే టిక్కెట్ ని సొంతం చేసుకున్నాడు. అర్జున్ అమర్ ఇద్దరూ కలిసి పాము టాస్క్ ఆడారు.
ఈ టాస్క్ లో ఎవరు ఎక్కువగా పాము నోట్లో బాల్స్ వేస్తే వాళ్లే విన్నర్స్. అమర్ కంటే కూడా స్పీడ్ గా అర్జున్ బాల్స్ వేసి తన సత్తాని చూపించాడు. అయితే, బిగ్ బాస్ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అర్జున్ ఫినాలే టిక్కెట్ సంపాదించినా కూడా నేరుగా ఫినాలేలో అడుగు పెట్టలేడని, ఈవారం ఎవిక్షన్ నుంచీ తప్పించుకుంటేనే ఫైనల్స్ లోకి వెళ్తాడని చెప్పాడు. అంటే, ఈవారం అర్జున్ ఖచ్చితంగా సేవ్ అవ్వాల్సి ఉంటుంది.
అలా సేఫ్ అయితేనే ఫినాలే టిక్కెట్ తనకి చెందుతుంది. లేదంటే అది వేస్ట్ అయిపోతుందన్నమాట. ఇక అమర్ కి వచ్చి ఉంటే నేరుగా ఫినాలేకి వెళ్లేవాడు. ఎందుకంటే, అమర్ ఈవారం నామినేషన్స్ లో లేడు. నామినేషన్స్ లో ఉన్నవాళ్లలో అర్జున్ – గౌతమ్ – యావర్ – ప్రియాంక ఇంకా శోభాశెట్టి ఈ ఐదుగురు కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. మరి ఈసారి (Bigg Boss 7 Telugu) అర్జున్ సేఫ్ అవుతాడా లేదా అనేది చూడాలి.