Bigg Boss 9: ‘బిగ్‌బాస్ 9’ 15 మంది కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు.. ఒరిజినల్ లెక్కలు ఇవే

తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అతిపెద్ద రియాలిటీ షో, బిగ్‌బాస్- సీజన్ 9తో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి 2 వారాలు కావస్తోంది. ఈసారి 15 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ సీజన్లో 9 మంది సెలబ్రిటీలు, 6 మంది కామన్ మెన్స్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు.ఈసారి సరికొత్త డ్రామాతో ప్రారంభించాడు బిగ్ బాస్. అసలు ఆట లోపల మొదలవకముందే, బయట వాళ్ల రెమ్యునరేషన్ల గురించి పెద్ద చర్చే నడిచింది.

Bigg Boss 9 Contestants Remuneration

ఈసారి ఎవరు ఎంత తీసుకుంటున్నారు? కామన్ మ్యాన్‌కు ఎంత? సెలబ్రిటీకి ఎంత? అనే హాట్ టాపిక్‌పై సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలో రక రకాల వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఒరిజినల్ లెక్కలు వేరుగా ఉన్నాయి. ఇక లేట్ చేయకుండా ఆ లెక్కలను ఓ లుక్కేద్దాం రండి :

1) తనూజ : మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సీరియల్ నటి తనూజకి వారానికి రూ.2 లక్షలు పారితోషికంగా ఇస్తున్నారట.

2)ఫ్లోరా షైనీ : ఆశా షైనీ అలియాస్ ఫ్లోరా షైనీ 2వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈమెకు వారానికి గాను రూ.3 లక్షలు పారితోషికంగా ఇస్తున్నారట.

3)కళ్యాణ్ పడాలా : కామన్ మెన్స్ లో ఒకరైన కళ్యాణ్ మూడో కంటెస్టెంట్ గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇతనికి ఒక్కో వారానికి గాను రూ.60 వేలు పారితోషికంగా ఇస్తున్నారట.

4)‘జబర్దస్త్’ ఇమ్మాన్యుయెల్ : ‘జబర్దస్త్’ ఫేమ్ ఇమ్మాన్యుయెల్ సినిమాల్లో కూడా బిజీ కమెడియన్ గా రాణిస్తున్నాడు. 4వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఇతను ఒక్కో వారానికి గాను రూ.2.75 లక్షలు పారితోషికంగా అందుకుంటున్నాడట.

5)శ్రష్టి వర్మ : 5 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి వారానికే ఎలిమినేట్ అయ్యింది శ్రష్టి వర్మ. చాలా సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా పనిచేసిన ఈమె ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా బిజీగా ఉంది. ఈమె క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని.. ఈమెకు ఒక్కో వారానికి గాను రూ.2.5 కోట్ల పారితోషికం ఆఫర్ చేశారట.

6)మాస్క్ మ్యాన్ హరీష్ :మాస్క్ మ్యాన్ హరీష్ 6 వ కంటెస్టెంట్ గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇతను హౌస్ లో ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు.ఇతనికి ఒక్కో వారినికి గాను రూ.75 వేలు పారితోషికంగా ఇస్తున్నారట.

7) భరణి : ‘అమృతం’ ‘చి ల సౌ’ సీరియల్స్ తో పాపులర్ అయిన భరణి ‘గోపాల గోపాల’ వంటి పెద్ద సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేసి పాపులర్ అయ్యాడు. ఇప్పటికీ నెగిటివ్ రోల్స్ తో బిజీగా గడుపుతున్నాడు. ఇతని క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని రూ.2.6 కోట్లు ఒక్కో వారానికి చెల్లిస్తారట.

8) రీతూ చౌదరి : ‘జబర్దస్త్’ తో బాగా పాపులర్ అయిన ఈమె 8 వ కంటెస్టెంట్ గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తుంది. ఈమెకు ఒక్కో వారానికి గాను రూ.2.25 లక్షలు చెల్లిస్తామని బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పారట.

9)డెమోన్ పవన్ : 9వ కంటెస్టెంట్ గా కామన్ మెన్ ఎంట్రీ ఇచ్చిన డెమోన్ పవన్ ఒక్కో వారానికి గాను రూ.60 వేలు పారితోషికంగా అందుకుంటున్నారట.

10)సంజన గల్రాని : 10 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ‘బుజ్జిగాడు’ ఫేమ్ సంజన గల్రానికి ఒక్కో వారానికి గాను రూ.3 లక్షలు పారితోషికంగా ఆఫర్ చేశారట.

11) రాము రాథోడ్ : ‘రాను బొంబాయికి రాను’ అనే పల్లె పాటతో పాపులర్ అయిన రాము రాథోడ్ 11వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇతనికి ఒక్కో వారానికి గాను రూ.1.5 లక్ష పారితోషికంగా చెల్లిస్తామని ఆఫర్ చేశారట.

12)దమ్ము శ్రీజ : కామన్ మెన్ క్యాటగిరిలో ఎంట్రీ ఇచ్చిన మరో కంటెస్టెంట్ దమ్ము శ్రీజకి ఒక్కో
వారానికి గాను రూ.70 వేలు పారితోషికంగా ఆఫర్ చేశారట.

13)సుమన్ శెట్టి : ‘జయం’ ఫేమ్ సుమన్ శెట్టికి ఒక్కో వారానికి గాను రూ.2.75 లక్షలు పారితోషికం ఆఫర్ చేశారట.

14)ప్రియా శెట్టి : కామన్ మెన్ కేటగిరిలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియా శెట్టికి ఒక్కో వారానికి గాను రూ.60 వేలు పారితోషికంగా ఆఫర్ చేశారట.

15)మర్యాద మనీష్ : 15 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన మనీష్ కి ఒక్కో వారానికి గాను రూ.50 వేలు పారితోషికంగా ఆఫర్ చేశారట.

ఇవి ‘బిగ్ బాస్ 9’ కంటెస్టెంట్ల పారితోషికాల లెక్కలు. వీళ్ళు హౌస్ లో ఎన్ని వారాలు ఉన్నారు అనేది కాలిక్యులేట్ చేసి.. వీళ్ళు ఎలిమినేట్ అయిన తర్వాత సెటిల్మెంట్ చేస్తారు బిగ్ బాస్ నిర్వాహకులు.

అప్పుడు పూరి.. ఇప్పుడు అల్లు అరవింద్

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus