అప్పుడు పూరి.. ఇప్పుడు అల్లు అరవింద్

ఫేడౌట్ అయిపోయిన ఫిలిం మేకర్స్ కి సినిమా అవకాశాలు రావడం అరుదు. కానీ వాళ్ళ క్రేజ్ ను తమ సినిమా ప్రమోషన్ కి వాడుకోవాలని కొత్త ఫిలిం మేకర్స్ లేదా చిన్న ఫిలిం మేకర్స్ భావిస్తూ ఉంటారు. అలా వాళ్లకి మీడియా ముందుకు వచ్చి మైక్ అందుకునే అవకాశం వస్తుంది. దీనిని వాడుకుని హైలెట్ అవ్వాలని కొందరు స్పీచ్ బాగా ప్రిపేర్ అయ్యి వస్తారు. ఇంకొంతమంది కాంట్రోవర్షియల్ కామెంట్స్ చేసి హైలెట్ అవ్వాలని చూస్తారు.

Bandla Ganesh

అలాంటి వారిలో బండ్ల గణేష్ కూడా ఒకరు. సహజంగా మంచి వాక్చాతుర్యం కలిగిన బండ్ల గణేష్.. సినిమా వేడుకలకు వస్తే చాలు తన మార్క్ కాంట్రోవర్షియల్ కామెంట్స్ చేస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో కూడా బండ్ల గణేష్ స్పీచ్ కి ఎక్కువ రీచ్ వస్తుంది. ట్రోలింగ్ బ్యాచ్ బండ్ల గణేష్ స్పీచ్ ను బాగా వాడుకుంటూ ఉంటారు. సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం.. ఇటీవల ‘లిటిల్ హార్ట్స్’ అనే చిన్న సినిమా వచ్చింది.

రిలీజ్ అయ్యి 2 వారాలు దాటిన ఈ సినిమాకి పెద్ద సినిమాలు ‘మిరాయ్’ ‘కిష్కింధపురి’ వల్ల కొంచెం అటెన్షన్ తగ్గింది. ఆ లోటుని తీర్చేందుకు నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి ప్రమోషనల్ ఈవెంట్స్ ను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో ఏర్పాటు చేసిన సక్సెస్ సెలబ్రేషన్స్ కి అల్లు అరవింద్, విజయ్ దేవరకొండ,బండ్ల గణేష్..లను గెస్టులుగా పిలిచారు. వీళ్ళలో ఆటోమేటిక్ గా బండ్ల గణేష్ స్పీచ్ హైలెట్ అయ్యింది.

మైక్ పట్టుకుని తన మార్క్ స్పీచ్ తో విజృంభించి వెళ్ళిపోయాడు బండ్ల. ‘బన్నీ వాస్, వంశీ నందిపాటి.. కష్టపడి సినిమా తీస్తే.. చివర్లో ఇస్త్రీ షర్ట్ వేసుకుని వచ్చి అల్లు అరవింద్ క్రెడిట్ మొత్తం తీసేసుకుంటారని.. అది ఆయన అదృష్టం.. బన్నీ వాస్,వంశీ నందిపాటి..ల దురదృష్టం’ అంటూ అల్లు అరవింద్ కి చురకలు అంటించాడు బండ్ల గణేష్. అంతేకాదు.. ‘మహేష్ బాబు ట్వీట్ వేశాడు, రౌడీ(విజయ్ దేవరకొండ) షర్ట్ ఇచ్చాడు అని పొంగిపోకు. అదంతా అబద్దం. సక్సెస్ కొట్టిన తర్వాత నిన్ను ఆకాశంలో కుర్చోపెడతారు.. అలా మేఘాల్లో తేలావు అంటే ఈ మాఫియా మనల్ని బ్రతకనివ్వదు’ అంటూ మరో బాంబ్ పేల్చాడు బండ్ల.

కొన్నాళ్లుగా టాలీవుడ్లో ఈ ‘మాఫియా’ అనే పదం బాగా వైరల్ అవుతూ వస్తోంది. పెద్ద నిర్మాతల్లో అల్లు అరవింద్ వంటి వాళ్ళు చిన్న సినిమా నిర్మాతలను ఎదగనివ్వకుండా మాఫియా నడుపుతున్నారు అనే వాదన ఉంది. దీనిపై ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అందరూ మర్చిపోయిన టైంలో బండ్ల గణేష్ వచ్చి మళ్ళీ ఆ ఇష్యుని కెలికినట్టు అయ్యింది.

గతంలో పూరి, ఛార్మి..ల వ్యవహారం గురించి కూడా ఆకాష్ పూరి సినిమా వేడుకలో బయటపెట్టేసి అందరికీ షాకిచ్చాడు బండ్ల గణేష్. ఆ టైంలో పూరీ అసహనంతో ఓ పాడ్ కాస్ట్ చేయడం కూడా జరిగింది. సో అల్లు అరవింద్ వంటి పెద్ద స్టార్లు ఉన్నప్పుడు బండ్ల గణేష్ ని కనుక గెస్ట్ గా ఆహ్వానిస్తే.. ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి అని చిన్న సినిమా మేకర్స్ గమనించాల్సి ఉంది. ఒకవేళ ‘బండ్ల గణేష్ కనుక గెస్ట్ గా వస్తే మేము రాము’ అని కచ్చితంగా చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు.

బ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus