‘నేనేం… దెబ్బలు తినడానికి రాలేదు’… ‘బిగ్ బాస్ 9’ బ్యూటీ ఓల్డ్ కామెంట్స్ వైరల్!

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా వచ్చిన ‘బుజ్జిగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సంజనా గల్రానీ. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వంటి పలు చిత్రాల్లో నటించింది. ఇటీవల ‘బిగ్‌బాస్ 9’ లో కంటెస్టెంట్‌ ఎంట్రీ ఇచ్చి తన గేమ్ తో వార్తల్లో నిలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ క్లిప్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కెరీర్ ప్రారంభంలో ఓ స్టార్ హీరో వల్ల వేధింపులకు గురైనట్టు తెలిపి పెద్ద షాక్ ఇచ్చింది. ఓ కన్నడ సినిమా షూటింగ్లో భాగంగా.. సెట్‌లో తనకు ఎదురైన ఓ భయంకరమైన అనుభవాన్ని ఆమె ఆ వీడియోలో పంచుకుంది.

Sanjjanaa Galrani

ఆ సినిమా డైరెక్టర్‌తో గొడవల కారణంగా కోపంగా ఉన్న ఓ స్టార్ హీరో, ఆ ఫ్రస్ట్రేషన్‌ను తనపై చూపించాడని సంజన తెలిపింది. ఈ నేపథ్యంలో ‘సీన్ ప్రకారం ఆ హీరో నా చేతులు పట్టుకుని నడవాలి. కానీ అతను కోపంతో వచ్చి నొప్పితో విలవిలలాడేలా నా చేతులను గట్టిగా నొక్కేశాడు. నొప్పిగా ఉందని నేను చెబుతున్నా కూడా, ‘మ్యానేజ్ చేసుకో’ అంటూ సీరియస్‌గా లుక్ ఇచ్చాడు. అయినా నేను భయపడలేదు. వెంటనే షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి, అతనికి వార్నింగ్ ఇచ్చాను.

‘నేనేమీ ఇక్కడికి దెబ్బలు తినడానికి రాలేదు. ఇది యాక్షన్ సీన్ కాదు, నేను విలన్‌ను అసలే కాదు. ముందు నీ మైండ్‌సెట్ మార్చుకో, అప్పుడే షూటింగ్ చేద్దాం’ అని అతని మొహంపైనే చెప్పేశాను. అరగంట తర్వాత అతను కూల్ అయ్యాక ఆ సీన్ చేశాము’ అంటూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది సంజన. ‘ఇండస్ట్రీలో ఇలాంటి ‘క్రాక్’ బ్యాక్ కూడా ఉంటారు. వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని’ కూడా హితవు పలికింది సంజన.అయితే ఆ స్టార్ హీరో ఎవరనేది ఆమె బయటపెట్టలేదు.

తారక్‌ – నీల్‌ ‘డ్రాగన్‌’.. అనుకున్న టైమ్‌కి రానట్టేనా? నిర్మాత మాటలు వింటుంటే..

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus