‘దేవర’ సినిమా విజయం అందించినా.. ఎక్కడో చిన్న వెలితితోనే ఉన్నారు తారక్ అభిమానులు. ఆ వెలితిని ‘వార్ 2’ సినిమా తీర్చేస్తుంది అనుకుంటే.. ఇంకాస్త నొప్పిని కలిగించి వెళ్లిపోయిందా సినిమా. దీంతో ఇప్పుడు వారి చూపంతా ప్రశాంత్ నీల్‌తో తారక్ చేస్తున్న సినిమా మీదకు మళ్లింది. నీల్ గత సినిమాలు, ఎలివేషన్ల మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. దీంతో వచ్చే ఏడాది జూన్ నెలాఖరు ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.
అవును, ఎన్టీఆర్ – నీల్ సినిమా నిర్మాత్లలో ఒకరైన రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాటలు చూస్తుంటే సినిమా ముందుగా అనుకున్నట్లుగా జూన్ 25కి విడుదల కావడం అసాధ్యం అనిపిస్తోంది. ఎందుకంటే సినిమా షూటింగ్ దాదాపుగా అదే సమయానికి పూర్తవుతుంది అనిఇ నిర్మాత చెప్పారు. మరీ జూన్ అని చెప్పలేదు కానీ సమ్మర్ వరకు షూటింగ్ పూర్తవుతుంది అని చెప్పారు. అంటే మే ఆఖరు వరకు అనుకోవచ్చు.
అప్పటివరకు సినిమా సెట్స్ మీద ఉంటే జూన్ ఎండింగ్‌కి పోస్ట్ ప్రొడక్షన్, ప్రచారం చేసి రిలీజ్ చేయడం అసాధ్యం. ఈ లెక్కన తారక్ ఫ్యాన్స్ తమ ఫుల్ మీల్స్ కోసం మరికొన్ని నెలలు ఆగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ కొన్ని అంటే ఎన్ని అనేది ఇప్పుడు చెప్పలేం కానీ.. ‘డ్రాగన్’ (రూమర్డ్ టైటిల్) ఎంట్రీ ఇవ్వాలంటే కనీసం దసరా వరకు ఆగాల్సిందే అని ఇన్నర్ వర్గాల టాక్. కొన్ని రోజులు తారక్ సినిమా షూటింగ్‌కి గ్యాప్ ఇవ్వడం, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ పాజ్ కొట్టడమే దీనికి కారణం అని చెబుతున్నారు.
మరోవైపు అనుకున్న సమయానికి సినిమాలు రాకపోవడం ప్రశాంత్ నీల్ విషయంలో కొత్తేమీ కాదు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే.. ఈ సినిమా ఆలస్యమైతే అటు ‘దేవర 2’, త్రివిక్రమ్ సినిమా ‘కార్తికేయ’ కూడా ఆలస్యమవుతాయి. అవి ఇంకా బాధపెట్టించే అంశాలు. మరి తారక్ ఏమంటాడో చూడాలి.