Amardeep: అమర్ లో ఉన్న నెగిటివిటీ అదే.. అందరినీ నమ్మేస్తాడు?

  • November 18, 2023 / 06:07 PM IST

బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అమర్ దీప్ చౌదరి ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే మొదట్లో ఈయన కాస్త నెగెటివిటీని ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఆట తీరు మెరుగుపరుచుకొని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈయన టాప్ ఫైవ్ లో కొనసాగుతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే తాజాగా అమర్ తల్లి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె పలు విషయాలను వెల్లడించారు. ఫ్యామిలీ వీక్ లో భాగంగా అమర్ కోసం తేజు లోపలికి వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే తేజు లోపలికి వెళ్ళగా అక్కడ ప్రియాంకతో సరిగా మాట్లాడలేదంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఈమెను ప్రశ్నించగా మరి ప్రియాంకతో తేజు ఎందుకు మాట్లాడలేదో నాకైతే తెలియదు ఈ విషయం మీరు తన కోడలిని అడగాలి అంటూ సమాధానం చెప్పారు.

ఇక అమర్ కచ్చితంగా గెలుస్తారని తాను కప్పు తీసుకొని వస్తానమ్మా అని నాకు చెప్పి వెళ్లారని ఈమె తెలిపారు. అమర్ కప్పు గెలుచుకొని వస్తే మీరు ఆ డబ్బుతో ఏం చేస్తారు అంటూ యాంకర్ ప్రశ్నించగా అమర్ కోసం ఇల్లు కొంటామని అమర్ తల్లి వెల్లడించారు. ఎప్పటినుంచో ఇల్లు కొనమని అమర్ కు చెబుతూనే ఉన్నాను. అయినప్పటికీ కొనలేదని ఇప్పటికి రెంట్ హౌస్ లోనే ఉన్నారని ఈమె తెలియజేసారు.

అందుకే బిగ్ బాస్ హౌస్ లో తన కొడుకు గెలిచిన డబ్బుతో తనకు ఇంటిని కొనిస్తాను అంటూ (Amardeep) అమర్ దీప్ తల్లి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి తన తల్లి కోరిన విధంగానే ఈయన విన్నర్ అవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus