Pallavi Prashanth: బిగ్ బాస్ ఎంట్రీపై పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ పోస్ట్!

  • September 5, 2023 / 11:06 PM IST

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి రియాలిటీ షో లలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. ప్రస్తుతం ఈ కార్యక్రమం ఏడవ సీజన్ ప్రసారమవుతుంది ఇదివరకు ఆరో సీజన్లను పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా ఆదివారం ఏడవ సీజన్ ప్రారంభమైంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సెలబ్రిటీలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. అయితే మొదటిసారి కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా ఒక సాధారణ రైతు హౌస్లోకి కంటెస్టెంట్ గా వెళ్లారు.

సోషల్ మీడియాలో ఎంతో మంచి ఆదరణ పొందినటువంటి రైతు (Pallavi Prashanth) పల్లవి ప్రశాంత్ తన వ్యవసాయానికి సంబంధించిన వీడియోలను చేస్తూ అభిమానులను సంపాదించుకున్నారు అయితే తనకు ఎప్పటినుంచో బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లాలని ఉందని నాకు ఒక అవకాశం కల్పించాలి అంటూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వేడుకున్నారు.ఈ క్రమంలోనే ఈయనకు ఈసారి అవకాశం కల్పించారు. ఇక పల్లవి ప్రశాంత్ ఏకంగా వరి బస్తాను వేదిక పైకి తీసుకువచ్చి నాగార్జునకు కానుకగా ఇస్తూ తన కల నెరవేరినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమంలోకి ఒక సాధారణ వ్యక్తిగా వెళ్లినటువంటి పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. నా స్వప్నం సాకారమైన వేళ.. నా ఆశయం నెరవేరిన వేళ.. ఎన్నో ఏళ్ల నుంచి బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లాలని నాగార్జున సార్ గారితో మాట్లాడాలని,ఆయనని తాకాలని అనుకుంటున్నాను ఇన్నాళ్లకు నా కల నెరవేరింది.

ఆయనను కలిసిన ఆ క్షణం ఎప్పటికీ మరువలేనిది. ఇలా నా కల ఫలించింది అంటే అందుకు నన్ను అభిమానించే మీరందరూ కారణం. మీ అందరికీ నా పాదాభివందనం జై జవాన్ జై కిసాన్ అంటూ ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లడంతో తన కల నెరవేరింది అంటూ ఎమోషనల్ అవుతూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus